Medical Conference
-
ఏపీలో వైద్య విధానాలు భేష్
సాక్షి, అమరావతి: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వంతో కలి సి పనిచేసేందుకు సిద్ధంగా ఉ న్నట్లు జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ చెప్పారు. విజ్ఞా న సముపార్జనలో భాగంగా వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనల్లో సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. గురువారం మంగళగిరిలోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినితో ఆమె భేటీ అయ్యారు. కుచ్లర్ మాట్లాడుతూ..కోవిడ్ సమయంలో భారత్ అందించిన సహాయానికి జర్మనీ రుణపడి ఉంటుందన్నారు. ఏపీలోనూ కోవిడ్ బాధితులకు వైద్యం అందించిన తీరును ప్రశంసించారు. యోగ, ఆయుర్వేదం వంటి ప్రాచీన వైద్య విధానాలను తమ దేశంలో అమలు చేసేలా.. అక్కడి వైద్య సాంకేతికతను ఏపీకి అందించేలా ఒప్పందాలకు ప్రతిపాదించారు. మంత్రి రజిని మాట్లాడుతూ..రూ.16వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తూ ఏపీని హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వైద్య పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ టాప్‌లో నిలుస్తోందన్నారు. ఏపీలోని నర్సింగ్ విద్యార్థులు వృత్తి నిర్వహణకు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నారని..వారికి కళాశాలల్లో జర్మన్ భాష నేరి్పంచేలా ఆలోచిస్తున్నామన్నారు. జర్మనీ వెళ్లే తమ విద్యార్థులకు నాలుగేళ్ల కాలపరిమితితో వీసాలు ఇవ్వాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా తమ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. జర్మనీ వైద్య రంగంలో మానవ వనరుల కొరతను భారత్ సాయంతో అధిగమిస్తామని మైకేలా చెప్పగానే..ఇప్పటికిప్పుడు 10వేల మంది నర్సింగ్ సిబ్బందిని జర్మనీకి పంపేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. విశాఖలోని మెడ్‌టెక్ జోన్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించగా మైకేలా సానుకూలంగా స్పందించారు. వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వెంటేశ్వర్లు, డీఎంఈ నర్సింహం పాల్గొన్నారు. -
ప్రసూతి సమస్యలకు ఆధునిక వైద్యం
తిరుపతి తుడా: మూడు రోజులుగా తిరుపతిలో ప్రసూతి, గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు ఆదివారంతో ముగిసింది. ఆధునిక విధానాలతో పాటు ప్రసూతి వైద్యంలో సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు. చివరి రోజు మొత్తం నాలుగు సెషన్లలో సదస్సు జరిగింది. గర్భిణుల్లో మూర్ఛ వ్యాధి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ సూచనలు చేశారు. ‘సేఫ్ మదర్, సేఫ్ బేబీ, సేఫ్ గైనకాలజిస్ట్‘ అనే అంశంపై డాక్టర్ పద్మజ మాట్లాడారు. ఈ ఏడాది ప్రసూతి, గైనకాలజీ సొసైటీ నినాదం కూడా అదే కావడం విశేషం. గర్భిణిల్లో థైరాయిడ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ కావ్య వివరించారు. ఇన్ ఫెర్టిలిటీలో ల్యాప్రోస్కోపీ పాత్రపై డాక్టర్ రామచంద్రయ్య ప్రసంగించారు. అనంతరం పీజీ వైద్య విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పేపర్ ప్రజెంటేషన్‌లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో తిరుపతి గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ భారతి, ఉపాధ్యక్షులు సునీత సుబ్రమణ్యం, ఆశాలత, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ లక్ష్మీ సుశీల, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పార్ధసారధిరెడ్డి, శేషసాయి, సునీత, మాధవి, భవాని, శ్రీదేవి, పద్మావతి, రాధ, ఉమాదేవి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా డాక్టర్‌తో అసభ్యప్రవర్తన
వైద్య సదస్సులో పాల్గొనేందుకు ముంబై నుంచి వచ్చిన డాక్టర్ హోటల్లో బస మారు తాళం చెవితో తలుపులు తెరచిన ఐదుగురు నిందితులు నాగోలు: వైద్య సదస్సులో పాల్గొనేందుకు ముంబై నుంచి నగరానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌పై ఇద్దరు హోటల్ సిబ్బందితో పాటు మరో ముగ్గురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన మహిళా డాక్టర్ (35), మరో డాక్టర్‌తో కలిసి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగే వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఎల్బీనగర్కు వచ్చారు. నిర్వాహకులు అభినందన గ్రాండ్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. మహిళా డాక్టర్‌కు ఒకగది, ఆమెతో పాటు వచ్చిన డాక్టర్‌కు మరో గది కేటాయించారు. రాత్రి 10.30 గంటలకు అదే హోటల్లో గదిని అద్దెకు తీసుకున్న భూపాల్‌రెడ్డి, యాదగిరి, దిలీప్, హోటల్ సూపర్వైజర్ నర్సింహ్మ మద్యం సేవించి మహిళా డాక్టర్ గది గడియను కొట్టారు. దీంతో ఆమె గది తలుపులు తెరిచింది. ఒంటరిగా ఉన్న విషయాన్ని వారు గుర్తించారు. సారి మేడమ్..మేము వేరే గదికి వెళ్లాలని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అరగంట తరువాత హోటల్ మేనేజర్‌తో కలిసి మొత్తం ఐదుగురు మారు తాళం చెవితో గది తలుపులు తెరిచి లోనికి చొరబడ్డారు. ప్రమాదం పసిగట్టిన బాధితురాలు వెంటనే అవేర్ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పది నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని ఠాణాకు తరలించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు పై ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. అభినందన గ్రాండ్ హోటల్లో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.