ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలుస్తూ...
సందర్భం
ఆత్మగౌరవం, వైవిధ్యం, ప్రజాస్వామ్యం నినాదంతో పని చేస్తున్న అఖిల భారత థీమేటిక్ సోషల్ ఫోరమ్ తన సమావేశాలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది. ఈ ఆది, సోమవారాలలో ఇవి జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజల ఆశలు వమ్ముకావడం, ఇతర అణచివేతల నేప థ్యంలో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
‘మరో ప్రపంచం సాధ్యమే!’ అన్న నినాదంతో 2001లో బ్రెజిల్లో ఆరంభమైన సంస్థ విశ్వ సామాజిక వేదిక (వరల్డ్ సోషల్ ఫోరమ్). 2004లో ఈ వేదిక సమావేశాలు ముంబైలోనే జరిగాయి. అప్పుడు ఎంచుకున్న నినాదం- ‘ప్రపంచీకరణ వర్గాన్ని మార్చాలి’. చరిత్రా త్మకంగా జరిగిన ఈ సమావేశాల మీద పరోమితా ఓరా డాక్యుమెంటరీ కూడా నిర్మిం చారు. ఈ డాక్యుమెంటరీ పేరు ‘పని జరుగుతోంది’. 2016లో మళ్లీ ఈ వేదిక సమావేశాలు కెనడాలోని మాట్రియల్, క్విబెక్లో జరగబోతున్నాయి. ఆగస్టు 9 నుంచి 12 వరకు ఈ సమావే శాలు జరుగుతాయి. బ్రెజిల్లో జరిగిన తొలి సమావేశాలలో ఇచ్చిన ‘మరో ప్రపంచం సాధ్యమే’ అన్న నినాదం ప్రపంచ దేశాలతో పాటు, భారతదేశంలో జరుగు తున్న పెట్టుబడిదారి వ్యతిరేక, ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలను ప్రతిబింబించింది. ఇప్పుడు కెనడా సమావేశాల సంద ర్భంగా ఇస్తున్న నినాదం, ‘మరో ప్రపంచం అవసరం: చేయి చేయి కలిపితే ఇది సాధ్యం’. ఈ సమావేశాలకు 20,000 మంది హాజరవుతారని అంచనా. ఈ వేదిక సమావేశాలు ఇప్పటిదాకా అభివృద్ధి చెందిన దేశాలలోనే జరుగు తున్నాయి. అయితే కెనడా సమావేశాల మీద కొంచెం విమర్శ వచ్చింది. ఈ సమావేశాలకు హాజరు కాదలిచిన పలువురు ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలకు కెనడా వీసాలు నిరాకరిం చింది. అందుకే ఈ సమావేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే నిర్వహించాలని, అక్క డయితే ఆహ్వానితుల రాకపోకలకు ఎలాంటి అవరోధాలు ఉండవని ఆఫ్రికా ప్రాంతం వారు కోరుతున్నారు. 2004లో ఇండియాలో జరిగిన ఐదు రోజుల విశ్వ సామాజిక వేదిక సమావేశా లకు లక్ష మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో ఎక్కువగా ప్రతిఘటనోద్యమాలకు చెందినవారు, రచయితలు ఉన్నారు.
2003లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఆసియా సామాజిక వేదిక సమావేశాలతో ఇక్కడ విశ్వ సామాజిక వేదికతో అనుబంధం ఏర్పడింది. 2004లో ఆసియా సామాజిక వేదిక సమావేశాలకు కొనసాగింపుగా 2007లో ఢిల్లీలో ఇండియన్ సోషల్ ఫోరమ్ సమా వేశాలు నిర్వహించింది. ఈ సంవత్సరం ఆత్మగౌరవం, వైవిధ్యం, ప్రజాస్వామ్యం అన్న నినాదంతో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన దళిత విద్యార్థుల ఉద్యమాలు, సామా జికోద్యమాలు కలసి థీమేటిక్ సోషల్ ఫోరమ్‌ను నిర్వహిస్తున్నాయి. సోషల్ ఫోరమ్ అంటే కేవలం నినాదాలకే పరిమితం కాదు. ఇది రెండేళ్లుగా క్షేత్ర స్థాయిలో కూడా ప్రజలను చైతన్యం చేసే పనిని నిర్వహిస్తున్నది. కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ ముంబైలో జరిగిన ఫోరమ్ నాలుగో సమావేశాలలో ఏకమైన సంస్థలు, రాజకీయ సంస్థలు ఇందుకు సహ కరిస్తున్నాయి. ఆత్మగౌరవం, వైవిధ్యం, ప్రజాస్వామ్యం అన్న నినాదంతో థీమేటిక్ ఫోరమ్‌గా ఏర్పడిన నిర్వాహకులలో ఎక్కువ మంది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారే.
2003లో జరిగిన ఆసియన్ సోషల్ ఫోరమ్ సమావేశాలలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పాలన పట్ల తెలంగాణ జేఏసీ అసంతృప్తితో ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. రూ. 9,800 కోట్లతో నిర్మించ తలపెట్టిన నీటి పథకం కోసం జరపతలపెట్టిన భూసేకరణ వివాదానికి కేంద్ర బిందువైంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు 51,000 మిలియన్ క్యుబిక్ అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగినదని, 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని ప్రభుత్వం చెబు తోంది. అయితే 14 గ్రామాలు ముంపునకు గురవుతాయి. భూసేకరణ చట్టం 2013 నిబంధనల మేరకు కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆందోళనకారుల ఆరోపణ. 20,079 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. థీమేటిక్ ఫోరమ్ కారణంగా వచ్చిన సానుకూల ఫలితం ఏమిటంటే యువకులు ముందుకు వస్తున్నారు.
విశ్వ సామాజిక వేదిక సమావేశాలు గత ఏడాది ట్యునిస్‌లో జరిగినప్పుడు అత్యధి కంగా ప్రతినిధులు మెగ్రెబ్, పశ్చిమ ఆసియా దేశాల నుంచి హాజరయ్యారు. 2007, జన వరిలో కెన్యా రాజధాని నైరోబీలో జరిగినప్పుడు 66,000 మంది హాజరయ్యారు. 2011 ఫిబ్రవరిలో సెనెగల్‌లోని డాకర్లో జరిగిన సమావేశాలకు 75,000 మంది ప్రతినిధులు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఆఫ్రికాకు చెందిన వారే. 2004 నాటి ముంబై సమావేశాలలో భారతీయ ప్రతినిధులు ఎక్కువగా హాజరయ్యారు.
(సమావేశాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా)
(వ్యాసకర్త : మీనా ఆర్ మీనన్ రచయిత, సామాజిక కార్యకర్త meenamen@gmail.com)