Mental handicaps
-
మానసిక వికలాంగురాలిపై సామూహిక లైంగిక దాడి
♦ బాధితురాలు ఏడు నెలల గర్భిణి ♦ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ♦ ఐదుగురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు తర్లుపాడు : మానసిక వికలాంగురాలిపై సామూహిక లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులపై గురువారం తాడివారిపల్లె పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై చౌడేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని తుమ్మలచెరువుకు చెందిన యువతికి అదే మండలం గానుగపెంటకు చెందిన వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో ఆమెను భర్త వదలి పెట్టాడు. ఆ క్రమంలో స్వగ్రామం తుమ్మలచెరువు చేరింది. ఇంతలో తల్లిదండ్రులు మరణించటంతో అనాథగా మారింది. మానసిక వికలాంగురాలిపై స్థానికులు కొందరు కన్నేశారు. భోజనం పెడతామంటూ స్థానికంగా నివాసం ఉండే ఐదుగురు మహబూబ్‌బాషా, యూసిన్, పెద్ద మాబూ, కబీరు, సంజయ్‌లు పలుసార్లు పశువాంఛ తీర్చుకున్నారు. విషయం తెలుసుకున్న కామాంధులు గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ చేరుుంచేందుకు ప్రయత్నించారు. 7 నెలలు దాటిన గర్భిణికి గర్భస్రావం చేస్తే ప్రాణహాని ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. తిరిగి ఆమెను గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం బాధితురాలి దూరపు బంధువు ఆమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదిలి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిందితులు మహబూబ్‌బాషా, యూసిన్, పెద్ద మాబూ, కబీరు, సంజయ్‌లపై ఎస్సై చౌడేశ్వర్ నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులుకాగా ఇద్దరి పేర్లు పోలీసులు తప్పించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. -
మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి
కృష్ణా: కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో ఓ మానసిక వికలాంగురాలిపై వావి వరుసలు మరిచిన కామాంధుడొకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వావిలాల గ్రామంలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఆమె మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వరుసకు బాబాయి అయిన హుస్సేన్ అనే వ్యక్తి లైంగికదాడికి ఒడిగట్టాడు. భాదితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు బుధవారం ఉదయ తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. (తిరువూరు) -
మానసిక వికలాంగ యువతిపై లైంగిక దాడి
ఒంటిమిది (కళ్యాణదుర్గం రూరల్) : మానసిక వికలాంగురాలైన యువతిపై లైంగికదాడి జరిగిన విషయం ఒంటిమిద్ది గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు(25) మూడు నెలల క్రితం అశోక్ అనే వ్యక్తి తోట సమీపంలోకి బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అతడు ఆ యువతిపై లైంగికదాడి జరిపాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచారుుతీ నిర్వహించారు. ఈ క్రమంలో యువతికి నెల రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు యువతి గర్భం దాల్చినట్లు సోమవారం నిర్ధారించారు. దీనిపై యువతి తల్లి బంధువులతో కలిసి వెళ్లి అశోక్ ను నిలదీసింది. దీంతో ఆగ్రహించిన అశోక్ యువతి తల్లిపై చేరుచేసుకునే ప్రయత్నం చేశాడు. భయపడిన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్ పరారీలో ఉన్నాడు. మానసిక వికలాంగ యువతిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జయనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.