బెంజ్ న్యూ ఎస్యూవీ లాంచ్
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ బుధవారం తన కొత్త అప్ గ్రేడెడ్ వెర్షన్ ఎస్యూవీని లాంచ్ చేసింది. ఏడు సీట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం జీఎల్ఎస్ 350 డీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. పుణే లో దీని ఎక్స్ - షోరూమ్ ధర రూ. 80.38 లక్షలుగా ప్రకటించింది. భారతదేశం ఎస్యూవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మరింత మెరుగైన సౌకర్యాలపై దృష్టిపెట్టినట్టు తెలిపింది. 2015 సం.రం లో 100 శాతం వృద్ధి సాధించామని, మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో రోలాండ్ ఫోల్గేర్ మీడియాకు చెప్పారు. భారత మార్కెట్ తమకు హైయ్యెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ అని పేర్కొన్నారు.
ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, హెడ్ ల్యాంప్ , లోగో ప్లేస్ మెంట్ తదితర మార్పులతో జీఎల్ఎస్ 350 డీని కంపెనీ రిమోడలింగ్ చేసింది. దీంతోపాటు కొత్త కలర్ ఆప్షన్స్ తో బ్రాండ్ న్యూ అవతారంలో కార్ లవర్స్ ను అలరించేందకు సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం నిర్దేశించుకున్న 12 మోడల్స్ లో ఇది తమకు నాలుగవది అని తెలిపారు. అయితే 2,000 సిసి డీజిల్ వాహనాలపై సుప్పీంకోర్టు నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని ఢిల్లీ -ఎన్సిఆర్ ప్రాంతంలో అమ్మకాలు జరపడం లేదని తెలిపారు. త్వరలోనే పెట్రోల్ వెర్షన్ తీసుకురానున్నట్టు తెలిపింది.
3073 ఎంఎం వీల్ బేస్ , 5130ఎంఎం పొడవు, 2141ఎం.ఎం వెడల్పు 1,849ఎంఎ ఎత్తు డైమెన్షన్,3.0 డీజిల్ ఇంజీన్, 8 అంగుళాల స్టాండలోన్ ట్యాబ్ లెట్ స్క్రీన్ విత్ టచ్ పాడ్ కంట్రోల్, నప్పా వెదర్ తో తయారుచేసిన 3 స్పోక్ స్టీరింగ్, 21 ఏఏంజీ లైట్ ఎలోయ్ వీల్స్ తదితర ఫీచర్స్ తో రిలీజ్ అయిన ఈ జీఎల్ ఎస్ వాహనం, ఆడి క్యూ 7, వోల్పో ఎక్స్ డీ 90, రేంజ్ రోవర్ కార్లకు ప్రధాన పోటీగా నిలవనుందని మార్కెట్ నిపుణుల అంచనా.