'జాగృతి' రచనల పోటీ
కోలిపాక శ్రీనివాస్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి, బెల్లంపల్లి
హైదరాబాద్లోని ‘జాగృతి’ తెలుగు వారపత్రిక ఆరెస్కేమూర్తి స్మారక ‘హాస్య’, వ్యంగ్య’ రచనల పోటీ నిర్వహిస్తోంది. 500 పదాలకు మించని చిన్నరచనలతో రచయితలు పెద్ద బహుమతి గెలుచుకోవచ్చు. ప్రథమ బహుమతి రూ.5,000లు, ద్వితీయ బహుమతి రూ.3,000లు. ఈ పోటీకి రచనలు ఇలా పంపవచ్చు. 1. రచయితలు తమ రచనలు డీటీపీ చేయించి పంపాలి. అనూ ఫాంట్ అయితే ఓపెన్ ఫైల్, లేకుంటే పీడీఎఫ్ ప్రతిని www.jagritiweekly@gmail.comకు ఈమెయిల్ చేయాలి. బహుమతికి ఎంపిక కాని రచనల నుండి నచ్చినవాటిని సాధా రణ ప్రచురణకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ జాగృతికి ఉంది.
కాగా, రచ నల్లో వస్తువు సామాజిక అంశాల్లో ఏదైనా కావచ్చు. సందర్భాను సారంగా అన్యభాషా పదాలు వాడినా రచన ప్రధానంగా తెలుగులోనే ఉండాలి. నిడివి 500 పదాలకు మించరాదు. అంగవైకల్యం, నిరక్షరా స్యత, పేదరికం, మతవిశ్వాసాలు, దేవతలను కించపర్చేవి, లింగవివక్ష చూపేవి కారాదు. హామీ పత్రం, పూర్తి చిరునామా తప్పనిసరిగా పం పాలి. రచనలు మాకు అందవలసిన చివరి తేదీ 31-12-2014. రచ నలు పంపవలసిన చిరునామా: జాగృతి ఆరెస్కే మూర్తి స్మారక వ్యంగ్య /రచనల పోటీ, జాగృతి భవనం, 3-4-228/4/1, లింగంపల్లి, కాచిగూడ, హైదరాబాద్ -27.
సంపాదకుడు, జాగృతి తెలుగు వారపత్రిక, హైదరాబాద్