merge with BJP
-
మళ్లీ బీజేపీలోకి గాలి జనార్దనరెడ్డి
సాక్షి, బెంగళూరు: మైనింగ్ వ్యాపారి, కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మళ్లీ కాషాయ పారీ్టలోకి చేరబోతున్నారు. కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆ పారీ్టలో చేరనున్నట్లు ఆదివారం మీడియాకు తెలిపారు. నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానమంత్రిగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. బళ్లారిలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు తెలిపారు. బీఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జనార్దనరెడ్డి, ఆ తర్వాత మైనింగ్ కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. కేఆర్పీపీని సొంతంగా ఏర్పాటు చేసి, 2023 ఎన్నికల్లో పోటీ చేశారు. -
బీజేపీకి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూపీలో అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. యూపీలో ముఖ్యంగా ఓబీసీలలో పట్టున్న ఆప్నా దళ్.. బీజేపీలో విలీనంకానున్నట్టు సమాచారం. వారణాశి-మీర్జాపూర్ ప్రాంతంలో ఆప్నా దళ్‌కు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీవైపు కుర్మీ ఓట్లు మళ్లే అవకాశముంది. అప్నా దళ్‌ను డాక్టర్ సోనె లాల్ పటేల్ స్థాపించారు. ప్రస్తుత లోక్‌సభలో ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మంగళవారం జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆప్నా దళ్ మీర్జాపూర్ ఎంపీ అనుప్రియ పటేల్‌కు కేబినెట్ బెర్తు దక్కవచ్చని భావిస్తున్నారు.