mers
-
జంతువుల నుంచే 75 శాతం ఇన్ఫెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ శతాబ్దంలో వచ్చిన సార్స్, మెర్స్, ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు జంతువుల నుంచే వ్యాప్తి చెందినట్లు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులు నిర్ధారించారు. పలురకాల జూనోటిక్ వ్యాధులు జంతువులు లేదా సూక్ష్మక్రిముల నుంచి మనుషులకు రోగాలను వ్యాపింపజేస్తాయని గుర్తించారు. ఈ రోగాల్లో కొన్నిజంతువులను అనారోగ్యానికి గురిచేయకపోయినా, వీటి వల్ల మనుషులు మాత్రం అనారోగ్యానికి గురవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం 1,200 ఇన్ఫెక్షన్లు సోకేందుకు కారణమైన వ్యాధులు, రోగాల్లో 816 జూనోటిక్ డిసీజెస్ జంతువుల నుంచి (75 శాతం వరకు) వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఇంకొంత కాలం ఇంటినుంచే) స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యం దాకా.. ఈ వ్యాధులు స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యానికి కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు అనుసరించాల్సిన వ్యూ హంపై ‘నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇన్ వన్ హెల్త్’పేరిట ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ జి.పద్మనాభన్ నేతృత్వంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. జంతువుల, సూక్ష్మక్రిముల నుంచి సోకే వైరస్లు, వాటి విస్తృతి, వ్యాప్తికి సంబంధించిన వివిధ అంశాలను మెరుగైన పద్ధ తుల్లో అర్థం చేసుకునేందుకు ఇది కృషి చేయనుంది. మూడేళ్ల కాలపరిమితిలో ఈ రోగాలు, వ్యాధులకు సంబంధించి ప్రాధాన్యాంశాలను గుర్తించడం తో పాటు, ఈ వైరస్లు మళ్లీ రాకుండా, ఇన్ఫెక్షన్లు మళ్లీ సోకకుండా, బయో సేఫ్టీ, బయో సెక్యురిటీకి సంబంధించిన సవాళ్లను పరిశీలించి వెంటనే చేపట్టాల్సిన చర్యలను సూచించనుంది. వాతావరణ మార్పులు, అడవులు తగ్గిపోవడం, జంతువులతో వ్యవహరించే తీరు, వలసలు, టూరిజం, పట్టణీకరణ, మనుషుల ప్రవర్తనలో మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, జనాభా పెరుగుదల, సాంస్కృతిక పరమైన అంశాలు, తదితరాలు జూనోటిక్ వ్యాధులు రావడానికి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏయే రకాలు.. వైరస్, బ్యాక్లీరియా, శిలీంద్రాలు తదితర పరాన్న జీవులు.. వీటిలో కొన్ని దోమలు, పేలు వంటివి వ్యాప్తి చేస్తాయి. వ్యాప్తి ఎలా.. ⇒ గాలి ద్వారా, కలుషితమైన మాంసం తినడం ⇒ వ్యాధి సోకిన జంతువులకు సన్నిహితంగా మెలగడం ∙ వ్యాధి సోకిన జంతువు తాకిన ఉపరితలాన్ని/ప్రాంతాన్ని ముట్టుకోవడం ⇒ దోమలు, పేలు వంటివి కుట్టినప్పుడు ఇవే జూనోటిక్ వ్యాధులు.. ⇒ ఆంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, బొవైన్ ట్యూబర్క్యులోసిస్, క్యాట్ స్క్రాచ్ ఫీవర్, డెంగీ ఫీవర్, ఎబోలా, ఎన్సెఫలైటిస్, ఫిష్ ట్యాంక్ గ్రాన్యులోమా, గ్లాండర్స్, హెపటైటిస్–ఈ, లెప్టోస్పైరోసిస్, లైమ్ డిసీజ్, మలేరియా, ప్యారట్ ఫీవర్, ప్లేగు, క్యూ ఫీవర్, రేబీస్, ర్యాట్ బైట్ ఫీవర్, రింగ్వార్మ్, స్వైన్ ఫ్లూ, డిప్తీరియా తదితరాలు. -
'మెర్స్'తో మరో ఇద్దరు మృతి
సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ సోకిన వారిలో మరో ఇద్దరు శుక్రవారం మరణించారు. దాంతో మృతుల సంఖ్య 31 పెరిగింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశంలో మరో మెర్స్ కేసు నమోదు అయిందని పేర్కొంది. అది శామ్సంగ్ ఆస్పత్రి వైద్యునికే అని చెప్పింది. అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో మెర్స్ వైరస్ సోకిన వారి సంఖ్య 181కి చేరింది. ఈ వైరస్ సోకిన వారిలో 81 మంది కోలుకున్నారని... ఇంకా 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ ఏడాది మే 20వ తేదీన దక్షిణ కొరియాలో తొలి మెర్స్ వైరస్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. -
కొరియాలో మరో ఎనిమిది మెర్స్ కేసులు నమోదు
సియోల్: దక్షిణ కొరియాలో మరో ఎనిమిది మంది మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 162కు చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన ఐదుగురు ప్రస్తుతం సియోల్‌లోని శామ్సంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. అలాగే ఈ ఆసుపత్రిలోని ఓ వైద్యుడికి ఈ వైరస్ ఇటీవలే సోకినట్లు గుర్తించామని చెప్పింది. ఈ వైరస్ సోకిన మరో ముగ్గురు హల్యమ్ యూనివర్శిటీ ఆసుపత్రితోపాటు గ్యాంగ్గాండ్ క్యూంగ్జీ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 19 మంది మరణించారని... అలాగే 124 మంది వైద్య చికిత్స పొందుతున్నారని... వారిలో 18 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. అయితే మెర్స్ వైరస్ సోకిన ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు దక్షిణ కొరియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దాదాపు దేశవ్యాప్తంగా 700 స్కూళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. -
మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
రెండేళ్ల క్రితం మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ వజృంభిస్తోంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్- మెర్స్)గా పిలిచే కరోనా వైరస్ బారిన పడి దక్షిణ కొరియాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురైన 58 ఏళ్ల మహిళను ఆసుపత్రిలో చేర్చగా సోమవారం ఆమె మరణించింది. వైద్యపరీక్షల అనంతరం కరోనా వైరస్ వల్లే ఆమె చినిపోయిందని, మంగళవారం మృతిచెందిన 71 ఏళ్ల వృద్ధుడు కూడా ఆ మహమ్మారి వల్లే చనిపోయాడని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 25 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించామని, ప్రస్తుతం రోగులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. 2012లో సౌదీ అరేబియాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ బారినపడి మధ్యప్రాచ్య దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకారి కరోనా... కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అరవై ఏళ్లు దాటిన వారికీ, మహిళలకూ ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమేనని వైద్యాధికారులు చెప్పారు. కరోనా వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి.. స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలను పోలి ఉంటుంది వైరస్ సోకిన రెండ్రోజుల్లోనే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, దగ్గు తీవ్రత పెరుగి ఊపిరితిత్తుల సమస్యలు మొదలవుతాయి. విపరీతమైన ఆయాసంతో గాలి తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత న్యుమోనియాకు దారితీసే అవకాశమూ ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రపిండాలకూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. -
ప్రపంచాన్ని వణికిస్తున్న మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్