స్కూటర్ టైర్ మార్కెట్లోకి మిచెలిన్
హైదరాబాద్: అంతర్జాతీయ దిగ్గజ టైర్ల తయారీ కంపెనీ ‘మిచెలిన్’ తాజాగా భారత్‌లో స్కూటర్, బైక్ టైర్ల మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ ‘మిచెలిన్ సిటీ ప్రో టైర్ల’ను మార్కెట్లో ఆవిష్కరించింది. 150 సీసీ బైక్స్ వరకు ఈ టైర్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో టూవీలర్ల డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, డైలీ సిటీ రైటింగ్‌కు టైర్లు అనువుగా ఉంటాయని మిచెలిన్ (ఆసియా, ఆఫ్రికా, మధ్య తూర్పు) టూవీల్స్ కమర్షియల్ డెరైక్టర్ ప్రదీప్ జి తంపీ తెలిపారు. ‘మిచెలిన్ సిటీ ప్రో టైర్లు’ దేశవ్యాప్తంగా ఉన్న మిచెలిన్ ప్రీమియం డీలర్షిప్స్ వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు.