ఒంగోలులో రెండుసార్లు భూప్రకంపనలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండు సార్లు భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. గతరాత్రి 11గంటల 30 నిమిషాలకు రెండు సెకన్లపాటు భూమి కంపించినా ప్రకంపనలను ఎవరూ గుర్తించలేకపోయారు. మరోమారు 11 గంటల 41 నిమిషాలకు సుమారు నాలుగు సెకన్లపాటు పెద్ద శబ్ధంతో భూమి కంపించింది.
దాంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా రెండుసార్లు భూ ప్రకంపనలు జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు స్థానికులు రాత్రంతా ఏమి జరుగుతుందోననే భయంతో జాగారం చేశారు.