9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది.
చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది.
అధ్యయనం ఇలా...
► రోమ్‌లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు.
► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు.
► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు.
► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు.
► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు.
► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు.
► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు.
► జెనెటిక్ బాటిల్ నెక్‌గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది.
► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట.
► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట.
► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట.
► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది.
► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్‌లో పబ్లిష్ అయ్యాయి.
‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్‌లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘
– ఫాబియో డీ విన్సెంజో
– నేషనల్ డెస్క్, సాక్షి