Minister Jogu Ramanna
-
2022 నాటికి ప్లాస్టిక్‌ను నిషేధిస్తాం..
ఎదులాపురం(ఆదిలాబాద్) : తెలంగాణలో 2022 నాటికి ప్లాస్టిక్‌ను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవనంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల జాతీయ సదస్సుకు రాష్ట్రం నుంచి మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. రెండో రోజు జరిగిన సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రి హర్షవర్ధన్, వివిధ రాష్ట్రాల అటవీశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. మంగళవారం సదస్సు అనంతరం తెలంగాణ భ వన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో మీడి యా సమావేశం నిర్వహించి సదస్సు వివరాలను మంత్రి రామన్న వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ను నిషేధించే విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో చర్చ జరిగిం దని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 15 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించామని, త్వరలో 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న వాటిని నిషేధించాలని భావిస్తున్నామని తెలిపా రు. వాతావరణ కాలుష్యం వల్ల రానున్న రోజుల్లో మానవ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలను రెండు రోజుల పాటు సదస్సులో వివరించామని చెప్పారు. తెలంగాణలో తడి, పొడి చెత్తలను సేకరించేందుకు రెండు బుట్టలను అందజేశామని త్వ రలో ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు నల్లరంగు ఉన్న డబ్బాలను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల నుంచి రోజుకు వచ్చే 7,270 మెట్రిక్ టన్నుల వ్యర్థాల నుంచి 7,053 టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన కాంపా నిధుల్లో పది శాతం కూడా విడుదల చేయడం లేదన్నారు. ఆ నిధులు విడుదల చేస్తే తెలంగాణ వ్యాప్తంగా అడువుల పెంపకాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. కాగా మొదటి రోజు సోమవారం రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి స్టాల్‌ను మంత్రి జోగు రామన్న, ప్రిన్సిపల్ సెక్రటరీలు అజయ్ మిశ్రా సందర్శించారు. స్టాల్లో ఏర్పాటు చేసిన మ్యాన్‌రైడింగ్ సిస్టమ్ మోడల్, వివిధ పరికరాలను పరిశీలించారు. సదస్సులో మంత్రితో పాటు తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ జి.అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
మంత్రి రామన్నను కలిసిన ఆరె సంఘం నేతలు
హన్మకొండ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను తెలంగాణ ఆరె కుల సం క్షేమ సంఘం నాయకులు కలిశారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని తెలంగాణ ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమిడి అంజన్‌రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యు డు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సం ఘం నాయకులు కలిసి ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చాలని కోరారు. ఈ అంశాన్ని కేంద్ర ఓబీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. సంఘం నాయకులు భలేరావు మనోహర్‌రావు, సిందె రాంనర్సయ్య, జెండా రాజేష్, ఇంగ్లీ శివాజీ, మాసంపల్లి లింగాజి పాల్గొన్నారు. -
జల పరిరక్షణతోనే మానవాళి భవిష్యత్తు!
తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సులో వక్తలు - వాన నీటి సంరక్షణ ఉద్యమంలా సాగాలని పిలుపు - వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఇకపై ఎరువుల వాడకమన్న పోచారం - 230 కోట్ల మొక్కలు నాటుతామన్న మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టేలా చర్యలు చేపట్టినప్పుడే మానవాళి మనుగడ సాగిస్తుందని తెలంగాణ జల సంరక్షణ వేదిక అభిప్రాయపడింది. భూగర్భ జలాలు పెంచుకునే ప్రణాళికలను రూపొం దించి, దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఉధృతంగా సాగాలని పిలుపునిచ్చింది. భవిష్యత్‌లో జల సంక్షోభాలు తలెత్తకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ జల సంరక్షణ వేదిక, దక్కన్ వాటర్ హార్వెస్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంయుక్తంగా ‘మేకింగ్ తెలంగాణ వాటర్ ఎఫిషియంట్ స్టేట్ బై 2020’ పేరిట సదస్సు నిర్వహించాయి. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వేదిక వ్యవస్థాపక చైర్మన్ వి.ప్రకాశ్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సింగరేణి డెరైక్టర్ మనోహర్‌రావు, సీనియర్ జర్నలిస్టు అష్టకాల రామ్మోహన్ హాజరయ్యారు. నీటి సంక్షోభానికి వర్షపాతం తగ్గడం కారణం కాదని... కురిసిన ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోకపోవడమే కారణమని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. భూగర్భ జలాలు పెంచుకునేలా చర్యలు చేపట్టాలని.. వాన నీటిని సంరక్షించి, భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఎరువులు: పోచారం రాష్ట్రంలో ఎరువుల వాడకంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తారణాధికారి, మం డలానికో వ్యవసాయాధికారి, డివిజన్‌కు ఒక ఏడీ ఉండేలా చర్యలు చేపట్టామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారి రైతుల పొలాలను పరిశీలించి చేసే సూచనల మేరకే ఫర్టిలైజర్ దుకాణాలవారు ఎరువులు, పురుగు మం దులు ఇచ్చే విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు 230 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. ఇప్పటికే 15కోట్ల మొక్క లు నాటామని, రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నీటి సంరక్షణ అందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సేంద్రియ ఎరువుల వాడకం వైపు రైతులు మళ్లేలా అవగాహన, ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. -
అపర భగీరథుడు కేసీఆర్
మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి పథకాలను వేగవంతం చేసి ప్రతి ఎకరాకు నీరందించేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారని అటవీ మంత్రి జోగు రామన్న కొనియాడారు. గోదావరిపై బ్యారేజీల నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణాల కోసం సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారుల బృందం ఈనెల 7న ముంబైకి వెళ్లనున్నారనీ, 8న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో ఒప్పందాలు చేసుకోబోతున్నారనీ తెలిపారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో సాగు, తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమన్నారు.