రాజీవ్ అందగాడనే పెళ్లాడా
లాహోర్: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అందగాడనే తాను వివాహం చేసుకున్నట్లు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరితో అన్నారు. 2005లో నాటి పాక్ ప్రధాని ముషార్రఫ్‌తో కలసి భారత్‌కు వచ్చిన ఖుర్షీద్ సోనియాతో జరిపి సరదా సంభాషణను తన కొత్త పుస్తకం ‘నైదర్ ఏ హాక్ నార్ ఏ డవ్’లో పొందుపరిచారు. అందులో సోనియా మాటలను ఉటంకించారు.‘అప్పుడు నేను (సోనియా) కేంబ్రిడ్జ్ వర్సిటీలో చదువుతున్నాను.
నా ఎదురుగా అందమైన యువకుడు వెళుతున్నాడు. నా పక్కనే ఉన్న సోహైల్‌ను(కాంగ్రెస్ నేత ఇఫ్తికరుద్దిన్ కుమారుడు) అతను ఎవరని అడిగాను. అతను(రాజీవ్) పండిట్ నెహ్రూ మనవడు అని సొహైల్ చెప్పాడు. నేను చిరునవ్వుతో ఆయన్ను(రాజీవ్) పలకరించా’ అని సోనియా చెప్పారన్నారు.