మూడేళ్లలో 339 ఉరిశిక్షలు
న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్లలో 2011 నుంచి 2013 మధ్యకాలంలో మొత్తం 339 మందికి మరణ శిక్ష విధించాలని తీర్పులు వెలువరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పారతి భాయ్ చౌదరి లోక్ సభలో ప్రకటించారు.
జాతీయ నేరాల రికార్డు సంస్థ వివరాల ప్రకారం 2011లో 117 మందికి ఉరిశిక్ష పడగా, 2012లో 97 మందికి, 2013లో 125 మందికి ఉరిశిక్ష పడినట్లు ఆయన వివరించారు. ప్రస్తుత వివరాల ప్రకారం వీటిలో ఐదు కేసులు మాత్రం క్షమాభిక్ష పిటిషన్లో ఉన్నాయని తెలిపారు. మరోపక్క, 2011లో ఎవరినీ ఉరి తీయలేదని 2012లో ఒకరిని, 2013లో మరొకరిని ఉరితీసినట్లు తెలిపారు.