minister visited
-
ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి.. మంత్రి ఆకస్మిక తనిఖీ..
లక్నో: యూపీలోని కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామం పంచాయతీ కార్యాలయంలో మంత్రి అసీమ్ అరుణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పంచాయతీ కార్యాలయానికి వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి పడుకున్నాడు. మంత్రి స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు. లేచాక ఆ కార్యదర్శి చేసిన హంగామాకు చుట్టూ ఉన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మిషన్-2024లో భాగంగా యూపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ మొదట కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నాయకులతో మొదట చర్చలు నిర్వహించిన మంత్రి తర్వాత వారితో కలిసి టిఫిన్ కూడా చేశారు. అనంతరం ఆ గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం లోపలికి వెళ్లేసరికి పంచాయతీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కమల్ ఫుల్లుగా తాగి మంచం మీద పడుకుని హాయిగా నిద్రిస్తున్నారు. మంత్రి తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. దగ్గరకు వెళ్తూ.. "ఎవరీయన..?" అనడిగారు. "ఆయన ఇక్కడి పంచాయతీ ప్రధాన కార్యదర్శి" అని అక్కడున్నవారు బదులిచ్చారు . షాకైన మంత్రి అతడిని తట్టి లేపగా గాఢ నిద్రలో ఉన్న కార్యదర్శి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ జనం ఉండటాన్ని చూసి మత్తులోనే లేచే ప్రయత్నం చేశాడు. లేస్తూ తూలిపడబోగా అతడిని స్వయంగా మంత్రి పట్టుకుని ఊతమిచ్చారు. మొత్తానికి తేరుకున్న ఆ పెద్దమనిషిని చూస్తూ "నేను మంత్రిని" అని తనని తాను పరిచయం చేసుకుని "మీరు ఇక్కడ కార్యదర్శా..?" అని ప్రశ్నించారు. అవునన్నట్టు తల ఊపాడు సతీష్ చంద్ర. "తాగి ఉన్నావా?" అనడిగితే నేను తాగలేదని చెబుతూ మంత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ఒకసారి నడిచి చూపించమని మంత్రి అడగ్గా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా రెండడుగులు వేశాడు. నీ పేరేంటి అనడిగితే కార్యాలయం బయట సతీష్ చంద్ర కమల్ అని ఉన్న నేమ్ ప్లేటును చూపించాడు. మరీ ఇంతలాగా తాగితే ఎలా పని చేస్తారని మంత్రి ప్రశ్నించగా కార్యదర్శి కళ్లనీళ్లు పెట్టుకుని క్షమించమని కోరాడు. ఇంతలో అక్కడున్నవారు ఇదే కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఒక మహిళను నియమించారని ఆమే అన్ని పనులను చక్కబెడుతుందని మంత్రి అసీమ్ అరుణ్ కు వివరించారు. మంత్రి కార్యదర్శికి నాలుగు చీవాట్లు పెట్టి వారించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. Intoxicated Pradhan Ji, Minister reached office 😳 WATCH .#PanchayatOffice #AseemArun #Kannauj #UttarPradesh #ViralVideo #ViralPost #ViralNews #ViralShorts #ViralReels #viralpage #AsianetNewsable pic.twitter.com/Otn8QoRCLy — Asianet Newsable (@AsianetNewsEN) July 15, 2023 ఇది కూడా చదవండి: మీ ఇంట్లో గేదెలు పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా? -
ఒడియా విద్యార్థుల ఉన్నతికి సహకరిస్తాం
ఇచ్ఛాపురం : ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా విద్యార్థుల ఉన్నతికి తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించనుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బద్రినారాయణ పాత్రో హామీ ఇచ్చారు. పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక ఒడియా పాఠశాల, ప్రభుత్వోన్నత పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఒడి యా విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వోన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ఒడియా విద్యార్థుల రెండో భాషగా తెలుగు, హిందీలకు 50 మార్కుల చొప్పున కేటాయించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించి ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరిస్తానని హామీఇచ్చా రు. ఈ పర్యటనలో భాగంగా బాపూజీ పట్ఘర్(ఒడియా గ్రంథాలయం)లో ఒడియా సంస్కృతి ని వివరించే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒడియా విద్యార్థులకు అవసరమయ్యే ఒడియా పుస్తకాల ను కూడా సరఫరా చేస్తామన్నారు. అనంతరం ఒడిశాలోని గంజాం, గజపతి, రాయఘడ జిల్లాల్లో తెలుగు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని విశ్రాంత ఉపాధ్యాయుడు కే.మోహన్‌రావు, పతంజలి సంజయ్ రెడ్డి, కొండాశంకర్రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం, ఉత్కలాంధ్ర ఒడియా మైనార్టీ అధ్యక్షుడు సత్యనారాయణపాడి, ఉత్కల్ సమ్మేళన్ అధ్యక్షుడు అద్వైత్కుమార్పాత్రో, అనంత్ జెన్నా, బిమల్‌చంద్ర సడంగి, ఉషాదేవి, పూర్ణమహా పాత్రో, తహసీల్దారు సురేష్, అనంత్‌కుమార్ మహాపాత్రో, కే.అప్పారావు, సాగరిక, బృందా వన్ దోళాయి, ఏపీ, ఒడియా టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ
సిద్దిపేట జోన్: వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. సిద్దిపేట మండలం రంగధాంపల్లిలో ఇటీవల మృతి చెందిన నిమ్మ సిద్దారెడ్డి, వంగ లింగమ్మ కుటుంబాలను మంత్రి కలిశారు. అనంతరం ఎన్సాన్పల్లికి వెళ్లారు. టీఆర్ఎస్ ఉప సర్పంచ్ అల్లం ఎల్లయ్యను పరామర్శించారు. సర్పంచ్ తండ్రి అంతయ్య ఇటీవల మృతి చెందారు. అనంతరం సిద్దిపేటలోని 20వ వార్డు కౌన్సిలర్ జావెద్‌ను కలిశారు. ఇటీవల కౌన్సిలర్ తల్లి చనిపోయింది. కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. -
నకిలీ ఏజెంట్ల వ్యవస్థను అరికడతాం: నాయిని
♦ దుబాయ్‌లో సోనాపూర్ ♦ క్యాంపును సందర్శించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నకిలీ ఏజెంట్ల చేతుల్లో అమాయకులు మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే గల్ఫ్‌లో ఉద్యోగాలిప్పిస్తామని హోంమంత్రి నాయిని న ర్సింహారెడ్డి అన్నారు. నకిలీ ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్మికులకు ఉపాధి, కంపెనీలతో ఒప్పందాల విషయమై శుక్రవారం దుబాయ్ వెళ్లిన మంత్రికి అక్కడి ఎయిర్‌పోర్టులో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం ఆయన కార్మికులు నివసిస్తున్న సోనాపూర్ క్యాంపును సందర్శించారు. యువత ఉద్యోగాల కోసం దళారుల ద్వారా గల్ఫ్ దేశాలకు వచ్చి ఎదుర్కొంటున్న ఇబ్బం దులు వర్ణణాతీతమన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి సీఎం కేసీఆర్ తెలంగాణ ఓవర్సీర్ మ్యాన్ పవర్ కంపెనీ(టామ్ కామ్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వమే గల్ఫ్ దేశాలలో ఉన్న కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వాటికి అనుగుణంగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. శనివారం(నేడు) నుంచి ఈనెల 23 వరకు దుబాయి కాన్సులేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయా కంపెనీలతో సమావేశం కానున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ డెరైక్టర్ భవానీ తదితరులున్నారు. నేడు దుబాయ్‌కు డిప్యూటీ సీఎం, ఎంపీ కవిత రాయికల్: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం దుబాయ్ వెళ్లనున్నారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దుబాయ్‌లో నిర్వహించే లేబర్ రోడ్‌షో, యూఏఈలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో స్కిల్ డెవలప్మెంట్పై నిర్వహించే సదస్సులో వీరు పాల్గొంటారు.