Minister VK Singh
-
పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది
జైపూర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుంది.. కాకపోతే దాని కోసం కొంత కాలం వేచి ఉండాలన్నారు కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని షియా ముస్లింలు సరిహద్దు గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారని చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు ఆ భూభగం దానంతటదే వచ్చి భారత్‌లో కలిసిపోతుందన్నారు. #WATCH | Dausa, Rajasthan | "PoK will merge with India on its own, wait for some time," says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm — ANI (@ANI) September 12, 2023 ఈ సందర్బంగా జీ20 సమావేశాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసశంసలు కురిపించిన ఆయన గతంలో ఇవే సమావేశాలు చాలా దేశాలు నిర్వహించినప్పటికీ భారత్ మరింత ఘనంగా నిర్వహించిందని ప్రపంచ వేదిక మీద భారత్ సత్తా ఏమిటో నిరూపించుకుందని అన్నారు. Every smallest move was so well planned in #G20BharatSummit How #Chinese Premier Li Qiang was greeted on his arrival? 1. Received by VK Singh, EX-ARMY General. 2. Considering #China 's LOVE for Northeast...Assamese song was played in background. Entire reception had NSA Ajit… pic.twitter.com/vCvE4RAse0 — BhikuMhatre (@MumbaichaDon) September 12, 2023 ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యాత్ర సమయంలో వారే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపారన్నారు. బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని ప్రధాని ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు. మంచితనంతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు కోరుకునే అభ్యర్థులకు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. #WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp — ANI (@ANI) September 8, 2023 ఇది కూడా చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ -
పాస్‌పోర్ట్ నిబంధనలు ఇక సరళం
పుట్టిన తేదీకి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు ► పదో తరగతి సర్టిఫికెట్, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, బీమా పత్రాల్లో ఏదైనా ఒక్కటి చాలు ► అటెస్టేషన్/నోటరీలకు స్వస్తి న్యూఢిల్లీ/విశాఖపట్నం: కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది.వివిధ కేటగిరీలకు చెందిన వారికి మినహాయింపులు ఇచ్చింది. విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఈ వివరాలను శుక్రవారం వెల్లడించారు. సవరించిన నిబంధనల్లో ముఖ్యమైనవి ► పుట్టిన తేదీని నిర్ధారించేందుకు తప్పనిసరి అయిన బర్త్ సర్టిఫికెట్ ఇకమీదట అవసరం లేదు. పదో తరగతి మెమో, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, ఏదైనా ప్రభుత్వరంగ సంస్థ జారీచేసిన బీమా పాలసీ పత్రం.. వీటిలో ఏదైనా ఒకదాన్ని ఆధారంగా చూపితే సరిపోతుంది. అయితే వాటిలో పుట్టినతేదీ ఉండాలి. ► గతంలో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా తెలపాల్సి ఉండగా, ఇకపై ఎవరి సంరక్షణలో ఉన్నారో వారి వివరాలు తెలపాలి. పాస్‌పోర్ట్ పుస్తకంలో అభ్యర్థి కోరిక మేరకు తల్లి లేదా తండ్రి పేరును నమోదు చేస్తారు. దరఖాస్తులో అనుబంధ వివరాలను తెల్ల కాగితం మీద సంతకం చేసి రాసివ్వాలి. నోటరీ, అటెస్టేషన్లకు పూర్తిగా స్వస్తి చెప్పారు. ► పెళ్లయిన అభ్యర్థులకు అనెక్సర్ ‘కె’ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పనిలేకుండా చేశారు. అభ్యర్థి విడాకులు పొందితే కోర్టు మంజూరు చేసిన పత్రాలు సమర్పించాలి. భర్త లేదా భార్య పేరును దరఖాస్తులో రాయనక్కర్లేదు. ► దత్తత తీసుకున్న పిల్లల విషయంలో రిజిస్ట్రేషన్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అది లేకపోతే దరఖాస్తుదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ళీ ప్రభుత్వోద్యోగులు గుర్తింపు పత్రంగా అనెక్సర్ ‘బి’, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌గా అనెక్సర్ ‘ఎం’ సమర్పించాలి. అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనెక్సర్ ‘ఎన్’ ఇవ్వాలి. సాధువులు, సన్యాసులు దరఖాస్తులో తల్లిదండ్రుల పేర్లకు బదులుగా తమ గురువు పేరు, గుర్తింపు పత్రం సమర్పించాలి. కాగా, నూతన నిబంధనలు ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. గతంలో జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారంతా ఆర్డీవో జారీ చేసిన పత్రం అందించాల్సిన నిబంధన ఉండేది. ఆ నిబంధన రద్దయింది. -
ఎంపీల్యాడ్స్ నిధులు రూ. 25 కోట్లకు పెంపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్) కింద ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఎంపీకి కేటాయిస్తున్న రూ. 5 కోట్ల నిధులను రూ. 25 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశంపై ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని గణాంకాల మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు. -
జోరుగా రెమిటెన్సులు...
ఆరు నెలల్లో 3,490 కోట్ల డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌లోకి రెమిటెన్సెస్ జోరుగా వస్తున్నాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె. సింగ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి 3,490 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్(విదేశాల్లో పనిచేస్తున్న స్వదేశీయులు తమ స్వదేశానికి పంపించే సొమ్ములు) వచ్చాయని రాజ్యసభకు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం 6,960 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్ వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం అంతకంటే ఎక్కువగానే వస్తాయని తెలిపారు. ప్రపంచంలో అందరి కంటే మనకే అధికంగా రెమిటెన్సెస్ వస్తున్నాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు 6,000 కోట్ల డాలర్లు, ఫిలిప్పైన్స్కు 2,500 కోట్ల డాలర్లు చొప్పున వచ్చాయని వివరించారు.