జోరుగా రెమిటెన్సులు...
ఆరు నెలల్లో 3,490 కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: భారత్‌లోకి రెమిటెన్సెస్ జోరుగా వస్తున్నాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె. సింగ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి 3,490 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్(విదేశాల్లో పనిచేస్తున్న స్వదేశీయులు తమ స్వదేశానికి పంపించే సొమ్ములు) వచ్చాయని రాజ్యసభకు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం 6,960 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్ వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం అంతకంటే ఎక్కువగానే వస్తాయని తెలిపారు.
ప్రపంచంలో అందరి కంటే మనకే అధికంగా రెమిటెన్సెస్ వస్తున్నాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు 6,000 కోట్ల డాలర్లు, ఫిలిప్పైన్స్‌కు 2,500 కోట్ల డాలర్లు చొప్పున వచ్చాయని వివరించారు.