ministry of shipping
-
79 కోట్ల టన్నుల కార్గో
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన నౌకాశ్రయాల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 79.5 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. వాటాల విక్రయం ద్వారా రూ.3,700 కోట్లు సాధించాలన్న లక్ష్యాన్ని మించి రూ.5,000 కోట్ల విలువైన రవాణా లావాదేవీలు జరిగాయని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ సెక్రటరీ సుధాన్‡్ష పంత్ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే సరుకు రవాణా గత ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం అధికంగా జరిగిందని తెలిపారు. పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి సర్వానంద సోనోవాల్ గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో ప్రధాన నౌకాశ్రయాల్లో దీనదయాల్ (కాండ్లా), ముంబై, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్ (కామరాజార్), ట్యూటికోరిన్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కత (హాల్దియాతో కలిపి), జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉన్నాయి. స్వల్పంగా పెరిగిన వాటా.. ప్రధానేతర పోర్టులతో పోలిస్తే చాలా ఏళ్ల తర్వాత మేజర్ పోర్టులు అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయని పంత్ తెలిపారు. ‘ప్రధానేతర పోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడతాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఓడరేవులను ప్రైవేట్ భాగస్వాములకు లీజుకు ఇచ్చాయి. సరుకు రవాణాలో నాన్–మేజర్ పోర్టులు 8.5–9 శాతం వృద్ధి చెందాయి. మొత్తం కార్గోలో ప్రధాన పోర్టుల వాటా 54 నుంచి 55 శాతానికి, నాన్–మేజర్ పోర్టుల వాటా 46 నుంచి 45 శాతానికి వచ్చి చేరింది. ప్రధాన పోర్టులకు 1 శాతం మార్పు కూడా చాలా ముఖ్యమైన విజయం. ఎందుకంటే చాలా సవాళ్లు ఉన్నప్పటికీ ఇవి తమ వాటాను పెంచుకున్నాయి. జలమార్గాల ద్వారా సరుకు రవాణా 16 శాతం ఎగసి 12.6 కోట్ల టన్నులకు చేరింది. ప్రధాన పోర్టులకు వచ్చిన నౌక పని ముగించుకుని వెళ్లేందుకు అయ్యే సమయం 3–4 గంటలు తగ్గింది’ అని వివరించారు. -
‘కోస్టల్ బెర్త్’లో రూ. 2,302 కోట్ల ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సాగరమాల కింద ‘కోస్టల్ బెర్త్ పథకం’లో రూ. 2,302 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నామని కేంద్రం ప్రకటించింది. మొత్తం 47 ప్రాజెక్టులకు గాను మహారాష్ట్రకు 12, ఏపీ, గోవాలకు పదేసి చొప్పున, కర్ణాటక 6, కేరళ, తమిళనాడుకు మూడేసి, గుజరాత్ 2, పశ్చిమ బెంగాల్‌కు ఒక ప్రాజెక్టు కేటాయించామని కేంద్ర నౌకాయాన శాఖ తెలిపింది. ఈ పథకంలో ప్రముఖ ఓడరేవులు, రాష్ట్రాల మారీటైం బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకూ రూ. 620 కోట్లు మంజూరు చేశామని, మిగతా 24 ప్రాజెక్టులకు అనుమతుల కేటాయింపులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది. -
‘నౌకాయాన ప్రోత్సాహకానికి మరిన్ని చర్యలు’
న్యూఢిల్లీ: భారతదేశ తీరప్రాంతాల్లో నౌకాయానానికి ఉన్న అన్ని సమస్యలను తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వాడకంలో ఉన్న తీర ప్రాంతాలనే కాకుండా అదనపు ప్రాంతాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం, అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయడంవంటివి చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర నౌకాయాన శాఖ సహాయమంత్రి సోమవారం రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బంకర్ ప్యూయెల్స్‌పైన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు అందులో పేర్కొన్నారు. రోడ్డు, రవాణ మార్గాలతో పోలిస్తే నౌకాయానంలో సర్వీస్ చార్జీలను 70శాతానికి తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోర్టు ప్రాంతంలో ఏర్పాటుచేసే మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం వరకు సహాయం అందజేస్తుందని చెప్పారు. పెద్దపెద్ద పోర్టులు నిర్వహిస్తున్న రో రో నౌకలకు డిస్కౌంట్ 40శాతం నుంచి 80శాతం వరకు రెండేళ్ల కాలానికి పెంచినట్లు వివరించారు. ఏప్రిల్ 1, 2016 నుంచి 31 మార్చి 2026 మధ్యకాలంలో నౌకల నిర్మాణానికి షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ పాలసీని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాగరమాల ప్రోగ్రాం కింద జాతీయ రహదారులను, రైలు లైన్లను సముద్ర తీర ప్రాంతాలతో అనుసంధానించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం కింద 79 ప్రాజెక్టులను గుర్తించినట్లు వివరించారు. మరోపక్క, వృద్ధుల పెన్షన్ స్కీంను ఇతర పెన్షన్ పథకాలను జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్ఎస్ఏపీ) కింద ఒకటి చేసే ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.