minor girl raped and murdered
-
14 ఏళ్ల బాలికను అతికిరాతకంగా..
లక్నో : ఓ మైనర్ బాలికను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. జలాన్ జిల్లాలోని అటా ప్రాంతంలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలిక శనివారం సాయంత్రం పని మీద బయటికి వెళ్లింది. రాత్రి వరకు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి పక్కన ఉండే వ్యక్తిని అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. కాగా ఆదివారం నిర్మానుష్య ప్రదేశంలో బాలిక విగత జీవిగా కనిపించింది. దారుణ పరిస్థితుల్లో.. కళ్లు బయటికి లాగిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. అయితే హత్య చేసేముందు బాలిక ఆత్యాచారానికి గురైందా అన్న విషయం తేలాల్సి ఉంది. నిందితుడిపై ఇప్పటికే మైనర్ బంధువును వేధించాడనే ఆరోపణలతో 376 సెక్షన్ కింద కేసు ఫైల్ అయ్యిందని, అరెస్టు చేసిన వ్యక్తిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పూర్తి వివరాలు వెల్లడించలేమని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
సికింద్రాబాద్లో దారుణం..
హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి పై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి అనంతరం హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్ బొల్లారంలోని కళాసిగూడలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు అనిల్ అత్యాచారం చేసి హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసిన అనిల్ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చి అక్కడే పడేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అనిల్ గతంలో ఎనిమిది హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. మహిళ హత్యకేసులో నిన్ననే జైలు నుంచి విడుదలైన అనిల్ తిరిగి ఈ ఘాతాకానికి ఒడిగట్టాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.