mints
-
Health Tips: రాత్రి భోజనంలో ఇవి తిన్నారంటే...
డిన్నర్లో ఏం తింటామో వాటిపై మన రాత్రి నిద్ర ఆధారపడి ఉంటుంది. చాలామంది రకరకాల ఫుడ్స్ తిని అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. జీర్ణక్రియకు భంగం కలిగించే ఆహారాన్ని తింటే ఉదయాన్నే పొట్టను క్లియర్ చేయడంలో సమస్య ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. తొంభైశాతం సరైన ఆహారం ఎంచుకోకపోవడం వల్ల రాత్రి నిద్ర పాడవుతుంది. అయితే రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మీ విందు చాలా తేలికగా, జీర్ణమయ్యేలా ఉండాలి. అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు లో భారం గా ఉండకూడదు. డిన్నర్లో తినే ఆహార పదార్థాలు గ్యాస్ ఉత్పత్తి చేయకూడదు. ఎందుకంటే ఇది నిద్రిస్తున్నప్పుడు కడుపు నొప్పికి కారణమవుతుంది. అంతేకాదు నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. డిన్నర్ చాలా కారంగా కూడా ఉండకూడదు. ఇది డీహైడ్రేషన్ సమస్యని సృష్టిస్తుంది. రాత్రి తరచుగా దాహం ఉండవచ్చు. రాత్రి భోజనంలో తేలికపాటి సుగంధ ద్రవ్యాలు, ఆవుపాలతో తయారు చేసిన దేశీ నెయ్యిని ఉపయోగించాలి. ఓట్స్ లేదా శనగ పిండితో చేసిన ఆహారాలని ఉపయోగించవచ్చు. పప్పు, చపాతీ అన్ని విధాలా బాగుంటుంది. అలాగే బ్రోకలీ, కొబ్బరి, పుదీనా ఉపయోగించిన వంటకాలు సులభంగా జీర్ణమవుతాయి. చదవండి: Health Tips: నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు! ఇవి తింటే మేలు! -
సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ
అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు ఆస్కార్‌లో అవార్డుల పంట పండించింది. బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది అప్పుడెప్పుడో వచ్చిన టైటానిక్ సినిమా. సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్లో ఉన్న విలువైన వజ్రాన్ని వెతికే క్రమంలో వెలకట్టలేని ‘ప్రేమ’ గురించి తెలుస్తుంది. టైటానిక్ ఘటన 1912 ఏప్రిల్ 14 రాత్రి జరిగింది. ఆ తర్వాత పదేళ్లకు 1922 మే 20న అదే తరహా ఘటనలో మన హైదరాబాద్ స్టేట్‌కి చెందిన కరెన్సీ సముద్రం పాలైంది. ఈ ప్రమాదం ఇండియాలో పేపర్ కరెన్సీ ముద్రణకు అడుగులు పడేలా చేసింది. ఆ ఘటన జరిగి వందేళ్లు పూర్తైన సందర్భంగా... దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు అప్పటి బ్రిటీష్ ఇండియాలో హైదరాబాద్ స్టేట్ ప్రిన్సిలీ స్టేట్‌గా ఉండేంది. హైదరాబాద్ స్టేట్‌కి ప్రత్యేక రైల్వే, టెలికాం, విద్యుత్‌లాగే సెపరేట్ కరెన్సీ ఉండేది. హైదరాబాద్ కరెన్సీని సిక్కాగా పిలిచేవారు. అప్పటి పాలకులైన నిజాం రాజులు ఈ కరెన్సీని ఎంతో భద్రంగా కట్టుదిట్టంగా లండన్‌లోని ప్రతిభూతి (మింట్)లో ముద్రించేవారు. అలా ముద్రించిన లక్షలాది రూపాయల విలువైన కరెన్సీని ఓడల ద్వారా ఇండియా సరిహద్దులకు తీసుకువచ్చేవారు. లండన్ నుంచి కరెన్సీ నిజాం రాజ్య పాలకుడిగా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కొనసాగుతున్న కాలంలో కరెన్సీ అవసరం ఉందంటూ లండన్‌కు కబురు పంపాడు. నిజాం ఆదేశాలను అనుసరించి లండన్ మింట్ వంద రూపాయల విలువ చేసే సిక్కా నోట్లు 40 వేలు, ఐదు రూపాయల విలువ చేసే సిక్కా నోట్లు 25 వేలు, పది రూపాయల విలువ చేసే సిక్కాలు ఒక లక్ష వంతున ముద్రించారు. మొత్తంగా ఈ కరెన్సీ విలువ ఆ రోజుల్లో రూ. 51.25 లక్షలు. సముద్రమార్గంలో ఈ కరెన్సీని ప్రయాణికుల ఓడలో ముంబైకి పార్సెల్ చేశారు. ఈ కరెన్సీ కట్టల పార్సెల్‌ను ది పెన్సిల్యూర్ ఓరియంటల్ స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఓడలో వేశారు. నిజాం కరెన్సీ కట్టలు కలిగిన ఓడ 1922 మే 19న ఇంగ్లండ్ నుంచి ముంబైకి బయల్దేరింది. అలా ఇంగ్లండ్ నుంచి బయల్దేరిన ఓడ మరుసటి రోజు సెల్టిక్ సముద్ర తీరంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సముద్ర వాతావరణం మారిపోయింది. ఎగిసిపడుతున్న అలలు, బలంగా వీస్తున్న గాలులకు ఓడ కంపించిపోయింది. జలసమాధి అల్లకల్లోల పరిస్థితుల మధ్య సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ దారితప్పి ఫ్రెంచ్ ఓడ ఉషాంత్ను ఢీ కొట్టి నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన 1922 మే 20 రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఓడలో ప్రయాణిస్తున్న 44 మంది ప్రయాణికులు, 294 మంది ఓడ సిబ్బంది జలసమాధి అయ్యారు. వీళ్ల ప్రాణాలతో పాటు నిజాం కరెన్సీ కూడా ఆ సముద్రంలోనే మునిగిపోయింది. తీర ప్రాంతం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఓడ జాడ లేకుండా పోయింది. పదేళ్ల పాటు నష్టపోయిన కరెన్సీ విషయంలో పార్సిల్ సేవలు అందించిన వాటర్లూ సంస్థకు నిజాం ప్రభుత్వానికి మధ్య వివాదం నడిచింది. ఆ రోజుల్లో లండన్‌లో ముద్రించిన కరెన్సీ హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ సంతకం చేసిన తర్వాతే ఆ కరెన్సీనికి విలువ ఉండేంది. లేదంటే అది ఉత్త కాగితంతో సమానం. ఇలా పదేళ్ల పాటు నడిచిన కేసు 1932లో కొలిక్కి వచ్చింది. వాటికి విలువ లేదంటూ నీటిలో మునిగిపోయింది నిజాం ఆర్థిక మంత్రి సంతకం చేయని కరెన్సీ అంటే అవి ఉత్త కాగితాలతో సమానం అని కోర్టు తీర్పు వచ్చింది. ఐనప్పటికీ నిజాంకి నష్ట పరిహారంగా రెండు వేల పౌండ్లు చెల్లించాలంటూ వాటర్లూను ఆదేశించింది. ఈ కేసులో తమకు అన్యాయం జరిగినట్టుగా నిజాం రాజులు భావించారు. నిజాం ముందు చూపు సముద్రంలో కరెన్సీ మునిగిపోయిన ఘటనతో నిజాం రాజులు పునరాలోచనలో పడ్డారు. ఎంతో దూరం నుంచి లండన్‌లో ముద్రించి సముద్రం మార్గంలో దాన్ని తెప్పించడం వ్యయప్రయాసలతో కూడిన పనిగా వారికి అర్థమైంది. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే తమ కరెన్సీ వ్యూహంలో మార్పులు చేశారు. తమ సంస్థానంలో ఉన్న నాసిక్‌లో పేపర్ కరెన్సీ ముద్రణాలయాన్ని 1928లో నెలకొల్పారు. నోట్ల రద్దు సమయంలో 2016 నవంబరులో ఒకేసారి సుమారు 15 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను రద్దు చేసింది భారత ప్రభుత్వం. దీంతో ప్రజల దగ్గన నగదు లేని పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున కొత్త కరెన్సీ ముద్రించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒకప్పుడు నిజాం రాజులు స్థాపించిన నాసిక్ పేపర్ కరెన్సీ ముద్రాణాలయం నిర్విరామంగా పని చేసింది. ఫలితంగా రెండు మూడు నెలలోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. హైదరాబాద్ మింట్ పేపర్ కరెన్సీ ఇండియాలోకి రాకముందు నాణెలు నగదుగా చలామణిలో ఉండేవి. వీటి కోసం హైదరాబాద్‌లో 1806లో మింట్‌ను ఏర్పాటు చేశారు. అంతకు ముందు 1770వ దశకంలో పేపర్‌ను కనుగొన్నారు. అనంతరం బ్రిటీష్ వర్తకుల రాకతో పేపర్ కరెన్సీ ఇండియాలోకి వచ్చింది. అయితే ప్రభుత్వ పరంగా ఇండియాలో తొలిసారిగా పేపర్ కరెన్సీ వాడకాన్ని బ్రిటీషర్లు 1861లో ప్రారంభించారు. ఇండియన్ కరెన్సీ లండన్‌లో ముద్రించేవారు. అప్పుడు అక్కడ ప్రింటింగ్ వ్యవస్థ ఉండేది. నిజాం కారణంగా ఇండియాలో పేపర్ కరెన్సీ ముద్రణ మొదలైంది. చదవండి: అది భారత భవిష్యత్తుకి మంచిది కాదంటున్న ఆర్బీఐ మాజీ గవర్నర్ -
రూపాయి నాణెం = రూ.1.11?
సాక్షి,ముంబై: రూపాయి నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.1.11. అవునా... అని ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఆర్బీఐ అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ఒక రూపాయి నాణెం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాలా రూపాయి పదకొండు పైసలు. అంటే దాని మార్కెట్ వాల్యూ కంటే అధికంగా ఖర్చు అవుతోందన్న మాట. ఆర్టీఐ ద్వారా ఇండియా టుడే అడిగిన ప్రశ్నను వివిధ ప్రభుత్వ నాణేల ముద్రణా కార్యాలను పంపించింది రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా. అయితే నాణేల ఉత్పత్తి కయ్యే మొత్తం వ్యయం వివరాలను అందించేందుకు ఇండియన్ గవర్నమెంట్ మింట్ (ఐజీఎం) నిరాకరించింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 8 (1) (డీ) ప్రకారం వాణిజ్య రహస్యమని పేర్కొంది. మింట్ అందించిన సమాచారం ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన ఖర్చు ఇటీవలకాలంలో భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో నాణేల తయారీని భారీగా తగ్గించి వేసింది మింట్. 2016-17లో 2201 మిలియన్ల నాణేలను తయారుచేసిన మింట్..2015-16లో 2151 మిలియన్లుగా ఉన్నాయి. వీటిలో రూపాయి నాణేల 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గించింది. హైదరాబాద్ మింట్ కూడా గత నాలుగు సంవత్సరాల గణాంకాల సమాచారాన్ని అందించింది. ముంబైతోపాటు హైదరాబాద్‌లలో ఉన్న మింట్ కేంద్రాల్లో రూ.10, రూ.5, రూ.2. రూ.1 నాణేలు తయారవుతున్నాయని మింట్ తెలిపింది. ఖర్చులు పెరిగినప్పటికీ నాణేల తయారీని నిలిపివేసే అవకాశాలు లేవని మింట్ ప్రకటించింది. అయితే రూపాయి నాణెంతో పోలిస్తే మిగిలిన నాణేల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ. 2 నాణెం తయారవుతుండగా, 5 రూ. నాణేనికి రూ.3.69, 10 రూపాయల నాణేనికి రూ. 5.54 ఖర్చు అవుతోంది. -
బ్యూటీప్స్
పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. -
మొదటిరోజే 'సుప్రీం' కలెక్షన్ల హవా
చెన్నై: పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్‌లతో మాంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'సుప్రీం' కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సుప్రీం' థియేటర్లలో తన హవాను చాటుకుంటోంది. తమిళ సూపర్ స్టార్ సూర్య 24 మూవీకీ ధీటుగా వసూళ్లను కొల్లగొడుతోంది. తన మార్క్ యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లలో బాగా ఆకట్టుకుంటున్న మెగా కుర్ర హీరో సాయి ధరమ్ తేజ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన మొదటి రోజే దాదాపు ఏడు కోట్లను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ గురువారం ప్రేక్షకులకు ముందుకొచ్చిన సుప్రీం ఒక్క రోజులోనే 6.75 లక్షల వసూళ్లను రాబట్టిందని సినిమా ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ ఐఏఎన్ఎస్ కు తెలిపారు. ఈ హవాతో వారాంతంలో మరిన్ని లాభాలను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యాక్షన్, కామెడీ ఎంటరైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సాయ్ క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోదన్నారు. ఆయన నటనే సినిమా విజయానికి బాగా తోడ్పడుతోందని తెలిపారు. రాసి ఖన్నా, రాజేంద్ర ప్రసాద్ , రవి కిషన్ సాయి కుమార్ , మైఖేల్ గాంధీ, కబీర్ దుహాన్ సింగ్, రదితరులు ఈ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.