మిస్ న్యూజెర్సీగా భారత సంతతి యువతి
వాషింగ్టన్: మిస్ న్యూజెర్సీ యూఎస్ 2014 కిరీటాన్ని 18 ఏళ్ల ఇండియన్ అమెరికన్ ఎమిలి షా గెల్చుకుంది. తెలుగు అమ్మాయి నీనా దావులూరి మిస్ అమెరికా ఎంపికయి చరిత్ర సృష్టించి నెల రోజులు పూర్తవగానే మరో ప్రవాస భారత యువతి అగ్రరాజ్య అందాల పోటీలో విజేతగా నిలవడం విశేషం.
ఎన్నారైలు అత్యధికంగా నివాసముంటున్న ఎడిసన్ ప్రాంతానికి చెందిన ఎమిలి షా 130 పోటీదారులను అధిగమించి మిస్ న్యూజెర్సీగా ఎంపికయింది. మిస్ అమెరికా, మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె పాల్గొననుంది. మిస్ టీన్ వరల్డ్ 2012 పోటీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఎమిలి షా తండ్రి ప్రశాంత్ షాకు బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.