కల్యాణ వైభోగమే..
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని మిట్టమల్లేశ్వర స్వామి ఆలయంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీలక్ష్మీ భూలక్ష్మి సమేత శ్రీసత్యనారాయణస్వామి వ్రతాన్ని, కల్యాణాన్ని కన్నుల పండువలా ని ర్వహించారు. పురోహితులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో శాస్రోక్తంగా కల్యాణం నిర్వహించా రు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. సాయంత్రం సత్యనారాయణస్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో కల్యాణ నిర్వాహకులు ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు నాగసుగుణాకర్, ఆలయ చెర్మైన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
రంగనాథుడి ఆలయంలో విశేష పూజలు..
తొలి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని అతిపురాతనమైన శ్రీరంగనాథస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కృష్ణరాజేశ్శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. రంగనాథస్వామిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం స్వామివారిని వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వెంకటేశ్వరస్వామి, అమ్మవారిశాల తదితర ఆలయాల్లో ఏకాదశి పూజలు నిర్వహించారు