MLA GORANTLA
-
గోరంట్ల ‘గృహ’తంత్రం
పేదల ఇళ్లపై ప్రజాప్రతినిధి కన్ను తన వాళ్లకు కట్టబెట్టేందుకు కుటిలయత్నం లబ్ధిదారుల ఎంపిక ముగిసినా తిరిగి సర్వే జాబితాల్లో పేర్లు తారుమారు ఏకంగా 700 మంది అనర్హులని తొలుత ప్రచారం సీఎం బాబు సమక్షంలో 75 మందే అనర్హులని అధికారుల ప్రకటన తాజాగా492 మందిని దూరం చేయడానికి రాజకీయ క్రీడ శాపనార్థాలు పెడుతున్న లబ్థిదారులు రాజకీయం కన్నెర్ర చేస్తే అధికారం వెనకడుగు వేయాల్సిందేననడానికి రాజమహేంద్రవరం ఆవరోడ్డులోని గృహాల వ్యవహారమే ఉదాహరణ. తొలుత 700 మందితో సిద్థమైన జాబితాలో కేవలం 75 మందేనని అనర్హులని తేల్చిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో ఆ సంఖ్యను ఏకంగా 492కు పెంచేసి తమ లెక్కలను తామే చెరిపేపుకుంటున్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల ‘గృహ’ తంత్రానికి సై అంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : పలుమార్లు సర్వేలు చేసి పేదలకు కేటాయించిన ఇళ్లను అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారికి కట్టబెట్టాలని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుటిలయత్నాలకు పాల్పడుతున్న వైనం బయటపడింది. రాజమహేంద్రవరంలోని ఆవరోడ్డులో ఉన్న దేవాదాయ స్థలంలో 2,256 గృహాలకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2009లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేశారు. 2014లో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారుల సమక్షంలో లాటరీ తీశారు. ఇళ్లు వచ్చిన లబ్ధిదారుల అర్హతపై గృహ నిర్మాణ శాఖ అధికారులు నాలుగుసార్లు సర్వే చేసి వారి నుంచి కొంత నగదు కట్టించుకున్నారు. గత నెల గోదావరి అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ గృహాలను లబ్థిదారులకు లాంఛనంగా పంపిణీ చేశారు. ఆ సమయంలో గృహా నిర్మాణ శాఖాధికారులు చేసిన సర్వేలో 2,256 మందిలో 75 మందిని అనర్హులుగా తేల్చారు. ఈ 75 మందికి మినహా మిగతా వారికి గృహాల నంబర్‌తో స్లిప్పులు కేటాయించారు. అనర్హుల స్థానంలో తిరిగి అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని అప్పుడు గృహ నిర్మాణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తమ వాళ్ల కోసం కుయుక్తులు 2014లో లబ్థిదారుల ఎంపిక కోసం తీస్తున్న లాటరీని కూడా గోరంట్ల అడ్డుకున్నారు. ఆ సమయంలో లబ్థిదారులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించారు. ఇప్పుడు తాజాగా ఆ ఇళ్లపై కన్నేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని జాబితాలో పేర్లు తారుమారు చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారు. సుమారు 700 మంది లబ్థిదారులను అనర్హులుగా ఎమ్మెల్యే ప్రచారం చేయించారు. 75 మంది అనర్హులని సీఎం పర్యటన సమయంలో తేల్చిన అధికారులు ఇప్పుడు 492 మంది లబ్ధిదారులపై తిరిగి సర్వే చేయాలని జాబితా కూడా సిద్ధం చేయాడాన్ని బట్టి వారిపై ఎమ్మెల్యే ఒత్తిడి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అనర్హుల పేరుతో వీరిని తొలగించి తమ వారికి ఇళ్లు కట్టబెట్టాలని గోరంట్ల కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నాలుగుసార్లు సర్వే చేసినా.. లబ్ధిదారులు తమ వాటాను అప్పులు చేసి పూర్తిగా చెల్లించారు. ఏడేళ్లుగా ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగు సార్లు సర్వే చేసి ఇళ్లు కేటాయిస్తూ స్లిప్పులు కూడా పంపిణీ చేసి ఇప్పుడు తరిగి సర్వే చేస్తామనడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అధికారుల సహాయంతో తమకు ఇళ్లు రాకుండా చేయాలని చూస్తున్నాడని వాపోతున్నారు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇళ్లు కేటాయించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్న గోర ంట్లకు తమ పిల్లల ఉసురు తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. లబ్ధిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ దృషికి తీసుకెళ్లి వారికి న్యాయం చేయాలని కోరారు. ––––––––––––––––––– స్లిప్పులు ఇచ్చి ఇళ్లు అప్పగించడంలేదు అప్పులు చేసి డీడీలు, వాయిదాలు కట్టాం. ఇళ్లు కేటాయించినట్లు గత నెల్లో సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు స్లిప్పులు కూడా ఇచ్చారు. కానీ ఇళ్లు అప్పజెప్పడంలేదు. తప్పుడు సర్వేలు చేస్తున్నారు. తమను అనర్హులుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. మా ఉసురు తగలకపోదు. – మాధవి. లబ్ధిదారు. ––––––––––––––––––––– లబ్థిదారులు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే గోరంట్లదే బాధ్యత పలుమార్లు సర్వే చేసి లబ్థిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు కేటాయించి ఇప్పడు మళ్లీ సర్వే చేయడం తగదు. ఒక్కొక్కరు అప్పులు చేసి రూ. 60 వేలు కట్టారు. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పడు ఇళ్లు రాలేదని వారు ఏౖ§ð నా అఘాయిత్యం చేసుకుంటే దానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్. –––––––––––––––––––– ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వే చేస్తున్నాం లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ నెల 26 నుంచి సర్వే చేపట్టాం. నాలుగేళ్ల క్రితం లబ్థిదారులకు స్లిప్పులు ఇచ్చారు. గతంలో లబ్థిదారుల అర్హతపై సర్వే చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరిగి సర్వే చేపడుతున్నాం. వారం రోజుల్లో పూర్తి చేస్తాం. – శ్రీనివాస్. ఈఈ, గృహనిర్మాణశాఖ -
గోరంట్లా.. దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలు
కడియం : చంద్రబాబు చెప్పిన మోసపూరిత హామీల గాల్లో గెలిచిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి దమ్ముంటే తక్షణం తన పదవికి రాజీనామాచేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సవాల్ చేశారు. పార్టీ నాయకుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో జేగురుపాడులో ఆదివారం పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్య అతిథులుగా రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జగన్‌ను నోటికొచ్చినట్టు విమర్శిస్తున్న గోరంట్ల తనకు పదవినిచ్చిన రూరల్ నియోజకవర్గం సమస్యలను పరిష్కరించడాన్ని మర్చిపోయారన్నారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి బంగారంపై అప్పులన్నీ తీర్చేస్తామని చెప్పుకొచ్చిన ఎంపీ మురళీమోహన్ ఏనాడైనా తన మాటను నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. ఆయన అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారంపై పెట్టిన శ్రద్ధ తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించంపై పెడితే మంచిదన్నారు. వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న గడపగడపకూ కార్యక్రమంలో ప్రజలు ఇంటికో సమస్యను చెబుతున్నారన్నారు. రైతు, డ్వాక్రారుణమాఫీ అమలు జరగక, ఇంటిరుణాలు, ఇళ్లస్థలాలు, పెన్షన్లు మంజూరు కాక, రోడ్లు, డ్రైన్లు వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు అంతా బాగుంటే ఇన్ని సమస్యలు ఎందుకున్నాయని రాజా ప్రశ్నించారు. ఎదుటి పార్టీ నాయకులను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాక్కుందామన్న ఆలోచనలే తప్ప ప్రజలు ఏమైపోతున్నారన్న ధ్యాస అధికార పార్టీకి లేకుండా పోయిందన్నారు. దోచుకోవడం అనే సింగిల్ పాయింట్ అజెండాతోనే చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. జగన్‌ను అతిగా విమర్శిస్తే జనమే తిరగబడే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అబద్ధపు హామీల కారణంగానే రూరల్‌లో ఆకుల వీర్రాజు ఓటమిపాలయ్యారని రాజా చెప్పారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు జక్కంపూడి రాజాను యాదల సతీష్‌చంద్రస్టాలిన్, జేగురుపాడు గ్రామస్తులు గజమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జేగురుపాడు ఆడదాని రేవు వద్ద నుంచి యువకులు మోటారుసైకిల్ ర్యాలీ, పువ్వులతో నాయకులకు ఘన స్వాగతం పలికారు. -
బీజేపీకీ కాంగ్రెస్ గతే..
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెప్పిన బీజేపీకి పడుతుందని రాష్ట్ర టీడీపీ ప్రధానకార్యదర్శి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో కమలనాథులు సీమాంధ్రుల ప్రయోజనాలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని రాజ్యసభలో అన్నారని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం ఇస్తామన్న ప్రత్యేకప్యాకేజీలు, జాతీయప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్రంలో ఉన్న రెండు పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.