ఇరవైరోజుల్లో చెరువుకు నీరు రప్పిస్తాం
అనాజిపురం (భువనగిరి అర్బన్) : ఇరవై రోజుల్లో బునాదిగాని కాల్వ ద్వారా పహిల్వాన్‌పురం చెరువుకు నీటిని రప్పిస్తామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అనాజిపురం గ్రామం చెరువులోకి బునాదిగాని కాల్వ ద్వారా వచ్చిన నీటిని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాయపురం అశోక్, వలిగొండ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఎరుకల సుధాకర్, వంగాల వెంకన్న. పాండు, జైపాల్‌రెడ్డి, మల్లేశం, మల్లికార్జున్, మచ్చ వెంకటేష్ పాల్గొన్నారు.