mla sivaprasad reddy
-
చంద్రబాబు దళిత ద్రోహి
దళితవాడలపై విద్యుత్ చార్జీల భారం మోపొద్దు ధర్నాలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు దళితవాడల్లో విద్యుత్ చార్జీలు లేవని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమా అని తినడానికి తిండి లేని దళితులు విద్యుత్ చార్జీలు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. దళితవాడలపై విద్యుత్ చార్జీల భారం మోపొద్దంటూ స్థానిక డీఈ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం నియోజకవర్గంలోని దళితవాడల ప్రజలతో కలిసి ఆయన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని విమర్శించారు. ప్రభుత్వం దళితవాడల్లో మీటర్లు బిగించుకోవాలని ఒత్తిడి చేస్తోందన్నారు. ఒక్క మారు మీటరు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్‌గా ప్రతి నెల వారు బిల్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం దళితవాడలపై సీలింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, అమృతేశ్వర ఆలయ కమిటీ కార్యదర్శి చిప్పగిరి ప్రసాద్, కౌన్సిలర్లు జయశంకర్, రాందాసు, రాజుపాళెం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు విజయభాస్కర్, తదితరులు ప్రసగించారు. అనంతరం డీఈ విజయన్‌కు వినతి పత్రం సమర్పించారు. -
డబ్బిస్తేనే బిడ్డను చూపించారు
కాన్పు చేస్తే డబ్బు అడుగుతున్నారు రెండు రోజుల నుంచి డాక్టర్ రాలేదని ఓ వృద్ధుడి ఆవేదన ఆస్పత్రిలో రోగుల సమస్యలు ఆలకించిన ఎమ్మెల్యే ► నా పేరు నాగ తులసి సార్. మాది జమ్మలమడుగు. రెండు రోజుల క్రితం కాన్పు కోసం ఆస్పత్రిలో చేరాను. మగబిడ్డ పుట్టాడు. రూ. వెయ్యి ఇస్తే గానీ లేబర్ వార్డులో సిబ్బంది బిడ్డను చూపించలేదు. ► నాపేరు శ్వేత. మాది శ్రీనివాసనగర్ మూడు రోజుల క్రితం ప్రసవ కోసం ఆస్పత్రిలో చేరాను. రక్తం తక్కువగా ఉందని, బయట ఎక్కించుకుని రమ్మని ఆస్పత్రి సిబ్బంది బయటికి పంపించారు. దాతను తీసుకొని వచ్చిన తరువాత ఆస్పత్రిలో చేర్పించుకున్నారు. ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇక్కట్ల ను పలువురు రోగులు ఇదే తరహాలో మొరపెట్టుకున్నారు. ఆస్పత్రి పరిశీలనకు వచ్చిన ప్రొ ద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వద్ద శుక్రవారం తమ గోడు వెళ్లబోసుకున్నారు. ► కొన్నేళ్ల నుంచి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల రెండు నెలల నుంచి పనికి రాలేదు. తర్వాత వచ్చినా, తనను పనిలో చేర్పించుకోలేదని మరియమ్మ వాపోయింది. ► మోడంపల్లెకు చెందిన గౌసియా షుగర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరింది. క్యాజువాలిటీలో ఉన్న ఆమెను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆమెకు పూర్తిగా నయం చేయాలని, అవసరమైతే ప్రయివేటు ఆస్పత్రికైనా తీసుకెళ్లి చికిత్స చేయించాలని వ్యక్తిగత కార్యదర్శి పెంచలయ్యను ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశించారు. ► జమ్మలమడుగుకు చెందిన రామన్న షుగర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలోని మందులు సరిపోకపోవడంతో అతను బయ ట డబ్బులు పెట్టి కొనాల్సి వస్తోంది. ఈ విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే షుగర్ వ్యాధికి కూడా మందులు లేకుంటే ఎలా అని ఆస్పత్రి అధికారులతో అన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి కనీస అవసరాలకు ఉపయోగపడే మందులు తెప్పించాలని చెప్పారు. ► మూడిండ్లపల్లెకు చెందిన ఐదో తరగతి వి ద్యార్థి రాజుకుమార్‌ను ఎమ్మెల్యే పరామర్శిం చారు. వైద్యం బాగా అందుతుందాని బాలుడి ని అడిగి తెలుసుకున్నారు. ఎర్రన్నకొట్టాలుకు చెందిన సుబ్బలక్షుమ్మ ఆయాసంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూపరింటెండెంట్ బుసిరెడ్డితో అన్నారు. ► ప్రొద్దుటూరుకు చెందిన రాజన్న వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చావాలనుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. బతికి ఉండి ఏమైనా సాధించవచ్చని అతనితో అన్నారు. ► ఆస్పత్రి ప్రాంగణంలో మదనపల్లెకు చెందిన మునెమ్మ అనే వృద్ధురాలు తీవ్ర నీరసంతో పడిపోయింది. ఆమెను చూసిన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి వైద్య సహాయం చేయాలని సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్ఎంవో డేవిడ్ు సూచించారు. -
కలెక్టర్ రాకుంటే ఎలా !
హెచ్‌డీఎస్ సమావేశంలో ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు ప్రొద్దుటూరు క్రైం: ఏడు నెలల తర్వాత జరిగే సమావేశానికి రావడానికి కలెక్టర్, డీసీహెచ్ఎస్కు తీరిక లేదా.. వాళ్లిద్దరూ లేకుంటే మీటింగ్ జరపడం ఎందుకు అని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటి సమావేశంలో జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి డీసీహెచ్ఎస్ ఎందుకు రాలేదని సూపరింటెండెంట్‌ను అడిగారు. ఈ మీటింగ్‌లో జరిగే విషయాలపై, తీర్మానాలపై ఎవరు బాధ్యత తీసుకుంటారు.. మీరు తీసుకుంటారా అని చైర్మన్ ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రిమ్స్ తర్వాత పెద్ద ఆస్పత్రిలో జరిగే ముఖ్యమైన సమావేశానికి కలెక్టర్ రాకుంటే సమావేశం జరపడం ఎందుకన్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు గైనకాలజిష్టులను నియమిస్తే సగం సమస్యలు తీరుతాయని అన్నారు. కలెక్టర్ సహకారం లేదు.. ప్రభుత్వం పట్టించుకోదు.. అలాంటప్పుడు సమస్యలు ఎలా తీరుతాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 7 నెలలకు సమావేశం జరపడం ఏంటి.. మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం ఏడు నెలల తర్వాత జరిగితే ఎలా అని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. కలెక్టర్, డీసీహెచ్‌ఎస్‌లు సమావేశానికి రాకపోవడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. మహిళా వైద్యులు లేకపోవడం వల్ల ఇక్కడ వైద్య సేవలు కుంటుపడుతున్నాయన్నారు. సమావేశాన్ని అడ్డుకున్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు జయశ్రీ, అన్వేష్ తదితరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. ఆస్పత్రిలోని స్కానింగ్, గైనకాలజిస్టుల కొరత, ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదని అనేక సార్లు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కరించే నాథుడే కరువయ్యారన్నారు. మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రి సమస్యలపై తాము కూడా ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. మే నెల 8న మరోసారి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగాలని సభలో తీర్మానించారు. ఎజెండాలోని పలు అంశాలను సభ ముందు పెట్టి ఆమోదం పొందారు. సమావేశంలో ఎంపీపీ మల్లేల ఝాన్సీరాణి, రాజుపాళెం జెడ్పీటీసీ సభ్యురాలు గుత్తి మంజుల, మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వైవీ స్వరూప్‌కుమార్‌రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్మోహన్‌రెడ్డి, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.