MLA Yarapathineni Srinivasa Rao
-
కేసు పెట్టినా మాకేం కాదు
ఆటోను ఢీకొన్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని బంధువుల కారు నలుగురికి గాయాలు ఆటోడ్రైవర్, స్థానికులపై ఎమ్మెల్యే బంధువులు, గన్మెన్ల దౌర్జన్యం కారు నుంచి కిందకు దిగని ఎమ్మెల్యే కావలి రూరల్: గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బంధువులకు చెందిన కారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రుద్రకోట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం కొత్తపేటకు చెందిన టి.లక్ష్మమ్మ తలకు బలమైన గాయాలు కాగా గుడ్లూరుకు చెందిన వెంకటరావు, బ్రహ్మయ్య, సింహాద్రిలకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల వివరాల మేరకు.. గుడ్లూరు నుంచి కావలికి వస్తున్న ఆటో జాతీయ రహదారిపై రుద్రకోట పాలిటెక్నిక్ కాలేజి వద్దకు రాగానే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ఈ సమయంలో ఏపీ07సీయు5555 నంబరుగల కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో కారుపల్టీలు కొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని స్ధానికులు 108 సహాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వీరికి చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులకు సమాచారమందించారు. బాధితులపైనే దౌర్జన్యం గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బంధువులతో కలిసి తిరుపతి వెళుతున్నాడు. ఈక్రమంలో అతని బంధువులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. దీంతో కారులోని వ్యక్తులు కిందకు దిగి ఆటో డ్రైవర్ పైన దౌర్జన్యానికి దిగారు. కనీసం గాయపడ్డవారికి సహాయం కూడా చేయకుండా దాడికి దిగడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో తాము అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మనుషులమని కేసులు పెట్టినా తమకు ఏమీకాదని స్ధానికులను దబాయించారు. ముందు కారులో వున్న ఎమ్మెల్యే కారు నుంచి దిగలేదు. ఆయన గన్మెన్లు కారుదిగి స్ధానికులతో వాగ్వావాదానికి దిగారు. బాధితులపైనే కేసులు పెడుతామని బెదిరించారు. స్ధానిక రుద్రకోటకు చెందిన యువకులు, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కారు కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకునేందుకు రూరల్ పోలీసులు వెనుకాడుతున్నారు. -
సున్నపురాయి అక్రమ తవ్వకాలు నిజమే..
- ‘యరపతినేని దందా నిజమే’ వార్తకు నిర్ధారణ - లోకాయుక్త నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు: గనుల శాఖ అమరావతి: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం సర్వేనంబర్ 690, పిడుగురాళ్ల గ్రామ సర్వేనంబర్ 1000, 1001లో సున్నపురాయి అక్రమ తవ్వకాలు నిజమేనని గనులు, భూగర్భశాఖ అంగీకరించింది. పిడుగురాళ్ల మండలంలో సున్నపురాయి అక్రమ తవ్వకాలకు అధికార టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్పడింది నిజమేనని లోకాయుక్త నిగ్గు తేల్చిందంటూ ‘సాక్షి’ వార్త ప్రచురించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గనులశాఖ సహాయ సంచాలకుడు బి.జగన్నాథరావు బుధవారం వివరణిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లోకాయుక్త నిగ్గుతేల్చిందన్న విషయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకాయుక్త నుంచి తమ శాఖకు ఎలాంటి ఆదేశాలు, నివేదికలు రాలేదని గనులశాఖ పేర్కొంది. అక్రమ తవ్వకాలు జరిగాయని అంగీకరించింది. ‘‘గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం సర్వేనంబర్ 690, పిడుగురాళ్ల గ్రామ సర్వేనంబర్ 1000, 1001లో సున్నపురాయి అక్రమ తవ్వకాలు రవాణాను అరికట్టడానికి రెవెన్యూ, పోలీసు, గనులు, పంచాయితీరాజ్ అధికారులతో డివిజన్, మండల, గ్రామస్థాయిలో బృందాలు ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 24న కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ బృందాలు తరచూ తనిఖీలు చేసి, అక్రమ తవ్వకాలు జరగకుండా అరికట్టాయి’’ అని వివరణలో గనులశాఖ పేర్కొంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని, కలెక్టర్, ఎస్పీ, గనులశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని లోకాయుక్త తన నివేదికలో బయటపెట్టడం తెలిసిందే. దీనిపై గనులశాఖ తన వివరణలో.. లోకాయుక్త నుంచి తవకు ఆదేశాలు రాలేదని, నివేదికలు ఇవ్వలేదంది తప్ప అక్రమ మైనింగ్ జరగలేదని పేర్కొనకపోవడం గమనార్హం. 2014 నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంటే.. 2016 మార్చి 24న అక్రమ మైనింగ్ నిరోధానికి ఉత్తర్వులిచ్చినట్లు పేర్కొన్నారు.