MLC YVB Rajendra Prasad
-
టీడీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు..
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై లాక్డౌన్ ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా కార్యకర్తలతో కలిసి కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో రాజేంద్రప్రసాద్‌తో పాటు తొమ్మిది మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ సమయంలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేసినట్లు ఉయ్యూరు పోలీసులు తెలిపారు. -
మా పార్టీవారే శవరాజకీయాలు చేస్తున్నారు
టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ మండిపాటు ఉయ్యూరు: ఉయ్యూరుకు సంబంధం లేని తమ పార్టీ నాయకులు కొంతమంది శవరాజకీయాలు చేసి తనపై ఆరోపణలు చేయించారని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. శవరాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న యారా వెంకటరమణ తనకు సన్నిహితుడని, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. ఆర్థిక వ్యవహారమై బాధితులు తనను ఆశ్రయిస్తే తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టే వెంకటరమణకు సరిచేసుకోవాలని నచ్చచెప్పానన్నారు. ఇతర కారణాలతో వెంకటరమణ ఆత్మహత్య చేసుకుంటే తనకు ఆపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.