మా పార్టీవారే శవరాజకీయాలు చేస్తున్నారు | TDP MLC YVB Rajendra Prasad comments oh his own party | Sakshi
Sakshi News home page

మా పార్టీవారే శవరాజకీయాలు చేస్తున్నారు

Published Mon, May 9 2016 3:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

మా పార్టీవారే శవరాజకీయాలు చేస్తున్నారు - Sakshi

మా పార్టీవారే శవరాజకీయాలు చేస్తున్నారు

టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ మండిపాటు

 ఉయ్యూరు: ఉయ్యూరుకు సంబంధం లేని తమ పార్టీ నాయకులు కొంతమంది శవరాజకీయాలు చేసి తనపై ఆరోపణలు చేయించారని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. శవరాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న యారా వెంకటరమణ తనకు సన్నిహితుడని, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. ఆర్థిక వ్యవహారమై బాధితులు తనను ఆశ్రయిస్తే తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టే వెంకటరమణకు సరిచేసుకోవాలని నచ్చచెప్పానన్నారు. ఇతర కారణాలతో వెంకటరమణ ఆత్మహత్య చేసుకుంటే తనకు ఆపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement