'రాజస్థాన్' ఘటనను ఖండించిన సీపీఎం
జైపూర్: రాజస్థాన్ లో ఓ మహిళను అర్థనగ్నంగా గాడిదపై ఊరేగించిన ఘటనను సీపీఎం ఖండించింది. బాధితురాలు తన మేనల్లుడిని హత్యచేసిందన్న ఆరోపణతో కొంత మంది పంచాయతీ పెద్దలు ఈ దారుణానికి ఒడిగట్టారు.
బీజేపీ 11 నెలల పాలనలో మహిళలపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని సీపీఎం నాయకుడు వసుదేవ్ ధ్వజమెత్తారు. వసుంధరా రాజే పాలనలో రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పిందని విమర్శించారు. మహిళ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అతివలను అవమానించే, అగౌరపరిచే సంఘటనలు పెచ్చుమీరుతుండడం దారుణమని అన్నారు.
బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రాజస్మానంద్ జిల్లాలోని తురవాద్ గ్రామంలో 45 ఏళ్ల మహిళను ఈనెల 8న అర్థనగ్నంగా గాడిదపైఊరేగించడం సంచలనం రేపింది.