Model 3 electric cars
-
కొత్త ఏడాదిలో మనకూ మోడల్-3 కార్లు!
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో అమెరికన్ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ దేశీయంగా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా జనవరి నుంచి మోడల్-3 కార్ల బుకింగ్స్ ప్రారంభమయ్యే వీలున్న్టట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టెస్లా ఇంక్ తయారీ మోడల్-3 కార్లు అత్యంత వేగంగా విక్రయయవుతున్న విషయం విదితమే.. 2017లో మార్కెట్లో ప్రవేశించిన మోడల్-3 కార్లు ఎలక్ట్రిక్ విభాగంలో అత్యధిక అమ్మకాలను రికార్డును సాధించాయి. దీంతో ఈ ఏడాది(2020) టెస్లా ఇంక్ షేరు 700 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో కంపెనీకి చోటు లభించడం కూడా దోహదం చేసింది. కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ అమ్మకాలలో మోడల్-3, మోడల్-Y కార్ల వాటా 89 శాతానికి చేరడం గమనార్హం! వెరసి మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రీత్యా ప్రపంచంలోనే టాప్ ఆటో కంపెనీగా టెస్లా ఇంక్ ఆవిర్భవించింది. (నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్) 2016లోనే.. భారత మార్కెట్లో ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌లోనే టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా 2021 జనవరిలో మోడల్-3 కార్ల బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. తద్వారా జూన్‌చివరికల్లా కార్ల డెలివరీలను ప్రారంభించాలని టెస్లా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2016లోనే మస్క్ మోడల్-3 సెడాన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఈ బాటలో వీటిని కొత్త ఏడాదిలో అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీ మార్కెట్లో కార్ల ధరలు రూ. 55-60 లక్షల మధ్య ఉండవచ్చని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఐకియా ఇండియా నష్టం రూ. 720 కోట్లు) పేటీఎమ్ నేత తొలుత 2016లోనే ఈకామర్స్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మోడల్-3 కారును బుక్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో టెస్లా ఇంక్ కార్ల తయారీ ప్లాంటును సందర్శించారు కూడా. కాగా.. పారిశ్రామికవేత్తలు మహేష్ మూర్తి, విశాల్ గొండాల్, సుజయత్ అలీ తదితరులు 1,000 డాలర్లు చెల్లించడం ద్వారా మోడల్-3 కార్లను బుక్ చేసుకున్నట్లు ఆటో వర్గాలు పేర్కొన్నాయి. మోడల్-3 కారు 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని, గంటకు 162 మైళ్ల వేగాన్ని సాధించగలదని తెలియజేశాయి. 0-60 మైళ్ల స్పీడ్‌ను 3.1 సెకండ్లలోనే అందుకోగలదని వెల్లడించాయి. ఇప్పటికే టెస్లా ఇంక్.. మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను ఆశించిన స్థాయిలో విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. ఇకపై మోడల్-3 కారు విక్రయాలను మరింత పెంచే ప్రణాళిల్లో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో భారత్ మార్కెట్‌పై దృష్టి సారించినట్లు వివరించాయి. ఇందుకు వీలుగా భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపైనా ఆసక్తిని చూపుతున్నట్లు వెల్లడించాయి. -
టెస్లా మోడల్3 తొలి ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ
లాస్ ఏంజిల్స్: అమెరికన్ లగ్జరీ ఎలెక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మూడు ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లకు అందించింది. కాలిఫోర్నియాలోని ఫ్రెమొంట్ వాహన తయారీ కర్మాగారంలో సంస్థ మొట్టమొదటి 30మందిలో ముగ్గురు కొనుగోలుదారులకు కార్ల కీ ని అందజేసింది. మోస్ట్ ఎవైటెడ్ ఎఫర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీకి శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ముగింపు పడిందని టెస్లా సీఈవో ఎల్లోన్ మస్క్ ప్రకటించారు. అమెరికా మార్కెట్లో మోడల్ 3 ప్రారంభ ధర 35వేల డాలర్లుగా (సుమారు రూ. 22.8 లక్షలు) ఉండనుంది. కాగా ఇప్పటికే లాంచ్ చేసిన మొట్టమొదటి మూడు వాహనాలు - రోడస్టర్, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లు చాలా ఖరీదు. దాదాపు లక్ష డాలర్లకు ( సుమారు రూ. 64 లక్షలు) పై మాటే. టెస్లా ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చుకుంటే మోడల్ 3 అత్యంత సరసమైన కారుగా చెప్పొచ్చు. మొత్తం అల్యూమినియం బాడీకాకుండా కొంత స్టీల్‌తో రూపొందించారు. ఇంకా సింగిల్ చార్జ్‌తో 5 నుంచి 6 సెకన్స్ లో 0.60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అయితే లార్జ్ బ్యాటరీ, ఆన్ స్క్రీన్ డ్యాష్ బోర్డు, ఫాన్సీ వీల్స్, మెటాలిక్ పెయింట్, అటానమస్ డ్రైవింగ్ ఫీచర్స్‌ను కావాలంటే కస్టమర్లు జోడించుకోవచ్చు. అలాగే ఈ కారుకు నాలుగు సంవత్సరాల, 50,000 మైళ్లవరకు వారంటీ ఉంది. 100,000 మైళ్ళ పరిధిలో ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంది. ఇది టెస్లా కు సంబంధించి గొప్ప రోజు..ఎప్పుడూ కేవలం ఖరీదైన కార్లనే తయారు చేయడం తమ లక్ష్యం కాదని , కార్లను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని తాము కోరుకుంటున్నామని టెస్లా సీఈవో మీడియాకు చెప్పారు. మోడల్ 3 కార్లను ఇపుడు ప్రీ బుకింగ్ చేసుకుంటే 2018లో చివరికి నాటికి అందించే అవకాశం ఉందని చెప్పారు. టెస్లా రూపొందించే ప్రతిదీ అందమైనదిగా ఉంటుందని టెస్లా చీఫ్ డిజైనర్ ఫ్రాంజ్ వాన్ హోల్జాజెన్ అన్నారు. మోడల్ 3 మరింత విశాలంగా కనిపించడానికి ప్రత్యేకంగా గ్లాస్ రూఫ్‌తో తయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ కారుకు డిమాండ్ విపరీతంగా ఉండడంతో మోడల్ 3 ప్రొడక్షన్ పెద్ద ఛాలెంజ్ అని టెస్లా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2017 ఆగష్టు నాటికి 100 కార్లను, సెప్టెంబర్ 2017 నాటికి 1500 కార్లను ఉత్పత్తి చేయనుంది.