Mohan Gandhi
-
సీనియర్ దర్శకుడు కన్నుమూత
చెన్నై: సీనియర్ దర్శకుడు, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు మోహన్‌గాంధీ రామన్ మంగళవారం కరోనాతో కన్నుమూశాడు. కరోనా సోకడంతో కొద్ది రోజుల క్రితం ఓమందూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. ఈయన సెల్వియన్ సెల్వన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వాకృధి, ఆనందభైరవి, విమోచన సమరం, స్వర్ణ విగ్రహం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చదవండి: ఎన్టీఆర్ వియ్యంకుడు కన్నుమూత -
పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అరెస్ట్
కాకినాడ: కాకినాడ-సామర్లకోట మధ్య చెక్‌పోస్ట్ వద్ద పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామర్లకోట మాజీ జెడ్పీటీసీ సత్తిబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో గాంధీ మోహన్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. న్యాయస్థానం గాంధీమోహన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో పోలీసులు గాంధీ మోహన్‌ను అరెస్ట్ చేశారు. 2012లో కూడా గాంధీ మోహన్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2005లో అధికారులను నిర్బంధించిన కేసులో ఆ వారెంట్ జారీ అయింది.