Mohini movie
-
ఫస్ట్ టైమ్ డబుల్ యాక్షన్ చేశాను
‘‘మోహిని’ కేవలం హారర్ సినిమా కాదు. ఇందులో రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అది చాలెంజింగ్‌గా అనిపించింది’’ అని హీరోయిన్ త్రిష అన్నారు. త్రిష ముఖ్య పాత్రలో దర్శకుడు మాదేష్ రూపొందించిన హారర్ చిత్రం ‘మోహిని’. ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్ రావు పల్లెల, కరణం మధులత ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ– రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్. ఫస్ట్ టైమ్ నేను డ్యూయల్ రోల్ చేశాను. వైష్ణవి, మోహినీ పాత్రల్లో కనిపిస్తాను. రెండు పాత్రలకు పోలికే ఉండదు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు మాదేష్ మాట్లాడుతూ – ‘‘హారర్ బేస్ట్ మూవీ అయినప్పటికీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.. అందుకే యు సర్టిఫికెట్ ఇస్తున్నాం అని సెన్సార్ వాళ్లు అన్నారు. 80 శాతం లండన్‌లో షూట్ చేశాం. త్రిషకు థ్యాంక్స్. చాలా స్టంట్స్, యాక్షన్ చేశారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రిషగారికి థ్యాంక్స్. త్రిషగారు బ్యాక్ విత్ బ్లాక్బాస్టర్. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.బి.గురుదేవ్, సంగీతం: వివేక్ మెర్విన్. -
ఫిబ్రవరిలో మోహిని వస్తోంది..
నటి త్రిష ఫిబ్రవరిలో తెరపై బీభత్సం సృష్టించడానికి మోహినిగా వస్తోంది. త్రిష చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అయ్యిందనే చెప్పాలి. 2016లో ధనుష్‌తో నటించిన కొడి చిత్రం తరువాత మరో చిత్రం విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా అరడజను చిత్రాలున్నాయి. వాటిలో ఒకటి మోహిని. ఆర్.మాదేశ్ దర్శకత్వం వహస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు సూర్య హీరోగా సింగం-2 చిత్రాన్ని నిర్మించిన లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. పూర్ణిమభాగ్యరాజ్, యోగిబాబు, స్వామినాథన్, ఆర్తిగణేశ్, పన్నీర్‌పుష్పంగళ్ సురేశ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాదేశ్ తెలుపుతూ.. తన గత చిత్రాల తరహాలోనే మోహిని భారీ ఎత్తున నిర్మిస్తున్నట్లు తెలిపారు. 80 శాతం విదేశాల్లో చిత్రీకరణ జరిపినట్లు చెప్పారు. ఇది హారర్ కథా చిత్రాలలో వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. నటి త్రిష యాక్షన్ సన్నివేశాలలోనూ నటించారని చెప్పారు. మోహిని చిత్రంలో విజువల్స్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, పాటలు చాలా బాగా ఉన్నాయని తెలిపారు. చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని, సెన్సార్ పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మాదేశ్ తెలిపారు. చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు 55 నిమిషాల పాటు ఉంటాయని, ఇది లండన్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అని ఆయన అన్నారు. -
దెయ్యాన్ని ఒక్కసారైనా చూడాలనుంది: నటి
హీరోయిన్ త్రిష దెయ్యాన్ని ఒక్కసారైనా చూడాలని అంటోంది. దెయ్యాన్ని చూడటమేమిటి అని అనుకుంటున్నారా .. అసలు ఈ చెన్నై బ్యూటీ ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడూ ప్రత్యేకమే అనిపిస్తుంది. ఈమె ప్రేమ పెళ్లి వరకూ వచ్చి రద్దైనా నటిగా కెరీర్‌కు ఎలాంటి భంగం కలగలేదు. ఆ తరువాత చాలా పాపులర్ అయ్యింది త్రిష. ఇప్పటికి తమిళం, తెలుగు చిత్రాలలో అగ్రనాయికల్లో ఒకరిగా రాణిస్తోంది. త్రిష నటిగా దశాబ్దంన్నర పూర్తి చేసుకుని అరుదైన రికార్డును సాధించింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన భేటీలో హీరోయిన్గా పదేళ్లు తర్వాత కథానాయకి అంతస్తును అందుకున్నారు. ‘నేను 15 ఏళ్లుగా అగ్రనాయకిగా రాణిస్తున్నానని చెప్పింది. అందాల పోటీల్లో గెలిచి ఆ తరువాత ఒక నటికి స్నేహితురాలిగా సిల్వర్‌స్కీన్‌కు పరిచయం అయ్యాను. తమిళ, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌ల్లో ఒకరిగా వెలుగొంతున్నాను. ప్రస్తుతం నా చేతిలో ఏడు చిత్రాలున్నాయి. వాటిలో మూడు చిత్రాలు దెయ్యం ఇతి వృత్తంతో కూడినవి. మోహినీ చిత్రం పూర్తిగా దెయ్యం కథతో రూపోందింది. త్వరలో ఈ చిత్రం తెరపైకి రానుంది. నాకు యాక్షన్ కథా చిత్రాలంటే, దెయ్యం కథా చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పింది. భయానక దెయ్యం కథా చిత్రాలలో నటించి ప్రేక్షకులను భయపెట్టాలని కోరుకుంటున్నారు. దేవుడు ఉన్నది నిజం అయితే దెయ్యం కూడా ఉండవచ్చు. అయితే మనిషిని మించిన శక్తి ఉందని నేను నమ్ముతాను. దెయ్యాన్ని చూశామని చాలా మంది అంటుంటారు. నాకూ ఒకసారి దెయ్యాన్ని చూడాలని ఉంది. ఇతర హీరోయిన్లతో నటించడానకి నేనెప్పుడూ రెడీనే. ఒకరికి మించిన హీరోయిన్లతో కలిసి నటించడం సరికొత్త అనుభవంగానూ, పోటీగానూ ఉంటుంది అని త్రిష చెప్పుకొచ్చింది. -
ఖుషీ ఖుషీగా చెన్నై చిన్నది..
కూతురు ఖుషీ అమ్మ బేజార్. అసలు అర్థం కాలేదు కదూ ‘అయితే రండి చూద్దాం. సంచలన నటీమణుల్లో త్రిష ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. నటిగా తెరంగేట్రం చేసి దాదాపు దశాబ్దన్నర అయ్యింది. అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆమె జోరు కొరవడలేదు. ఇంకా చెప్పాలంటే మరింత మార్కెట్‌ను పెంచుకున్నారనే చెప్పాలి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న వేళ్ల మీద లెక్కపెట్టే హీరోయిన్లలో ఈ చెన్నై చిన్నది ఒకరు. విశేషం ఏమిటంటే త్రిష ఏక కాలంలో మూడు చిత్రాలను పూర్తి చేయడం. తాను నటిస్తున్న మోహిని, గర్జన, చతురంగవేట్టై 2 చిత్రాలను పూర్తి చేసినట్లు తనే స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వీటిలో చదరంగవేట్టై 2 చిత్రంలో అరవిందస్వామికి దీటైన పాత్రలో నటించగా గర్జన, మోహిని తన పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రాలు కావడం విశేషం. ఇకపోతే గర్జన చిత్రంలో ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అంటూ ఇరగదీశారట. ఇందులో చాలా రిస్కీ సన్నివేశాలను చిత్ర యూనిట్ డూప్‌ను పెట్టి చెద్దామని చెప్పినా వద్దని తానే నటించారట. అలాంటి సన్నివేశాల్లో నటించిన త్రిష ఖుషీగానే ఉన్నారట. ఆమె తల్లి ఉమాకృష్ణన్ మాత్రం కూతురి డేరింగ్ చూసి బేజార్ అయ్యారట. మొత్తం మీద ఏక కాలంలో మూడు చిత్రాలను పూర్తి చేసిన త్రిష నటనకు చిన్న బ్రేక్ ఇచ్చి తల్లితో పాటు సమ్మర్ టూర్‌గా రోమ్ దేశాలు చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా నటించే షూటింగ్లో పాల్గొంటారట. అయితే ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. దీంతో అర్జెంట్‌గా విజయం చాలా అవసరం. పైన చెప్పిన చిత్రాలపై త్రిష చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.