ఖుషీ ఖుషీగా చెన్నై చిన్నది..
వీటిలో చదరంగవేట్టై 2 చిత్రంలో అరవిందస్వామికి దీటైన పాత్రలో నటించగా గర్జన, మోహిని తన పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రాలు కావడం విశేషం. ఇకపోతే గర్జన చిత్రంలో ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అంటూ ఇరగదీశారట. ఇందులో చాలా రిస్కీ సన్నివేశాలను చిత్ర యూనిట్ డూప్‌ను పెట్టి చెద్దామని చెప్పినా వద్దని తానే నటించారట. అలాంటి సన్నివేశాల్లో నటించిన త్రిష ఖుషీగానే ఉన్నారట. ఆమె తల్లి ఉమాకృష్ణన్ మాత్రం కూతురి డేరింగ్ చూసి బేజార్ అయ్యారట.
మొత్తం మీద ఏక కాలంలో మూడు చిత్రాలను పూర్తి చేసిన త్రిష నటనకు చిన్న బ్రేక్ ఇచ్చి తల్లితో పాటు సమ్మర్ టూర్‌గా రోమ్ దేశాలు చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా నటించే షూటింగ్‌లో పాల్గొంటారట. అయితే ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. దీంతో అర్జెంట్‌గా విజయం చాలా అవసరం. పైన చెప్పిన చిత్రాలపై త్రిష చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.