న్యూయార్క్‌కు చెక్కేసిన చెన్నై చిన్నది | Trisha moved to New York | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌కు చెక్కేసిన చెన్నై చిన్నది

Published Mon, May 1 2017 8:55 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

న్యూయార్క్‌కు చెక్కేసిన చెన్నై చిన్నది - Sakshi

న్యూయార్క్‌కు చెక్కేసిన చెన్నై చిన్నది

చెన్నై చిన్నది త్రిష అమెరికాకు చెక్కేసింది. సాధారణంగా వేసవి కాలం వస్తుందంటే చాలు తారలు శీతల ప్రదేశాలను వెతుక్కుని ఆ ప్రాంతాలకు జాలీ టూర్‌ వేస్తుంటారు. నటి త్రిషది ఇదే బాణీ. మామూలుగానే ఖాళీ సమయాల్లో స్నేహితులతో కలిసి సముద్రతీర ప్రాంతాల్లో తెగ ఎంజాయ్‌ చేసే ఈ బ్యూటీ సమ్మర్‌ డేస్‌లో విదేశీ టూర్‌ చేయాల్సిందే. తన స్నేహితులతో కలిసి ఏ అమెరికానో, స్విట్జర్లాండ్‌నో, న్యూజిల్యాండ్‌నో చుట్టేసి వచ్చేస్తుందట.

ఆ మధ్య తను పెళ్లి చేసుకోబోయే నిర్మాత, వ్యాపారవేత్త వరణ్‌మణియన్‌తో ఆగ్రా వెళ్లి ఎంజాయ్‌ చేసిన త్రిష (ఆ పెళ్లి పీటల వరకూ వెళ్లలేదనుకోండి) ఈ ఏడాది వేసవి విడిదికి అమెరికా చెక్కేసింది. గర్జనై, చతురంగవైట్టై, మోహిని చిత్రాలను పూర్తి చేసిన త్రిషకు సమ్మర్‌ డేస్‌లో చెన్నై అసలు పడదట. అందుకే ఈ రోజుల్లో విదేశీ పర్యటన తప్పనిసరి అట.

ప్రతిసారి  సమ్మర్‌ డేస్‌ను తన స్నేహితురాళ్లతో జాలీ డేస్‌గా మార్చుకుని ఎంజాయ్‌ చేసే ఈ జాణ ఈ సారి తన తల్లి ఉమాకృష్ణన్‌తో అమెరికాలో గడపడానికి వెళ్లింది. అక్కడ న్యూయార్క్‌ మహానగరంలో 7 నక్షత్రాల హోటల్లో బసచేసి నెల రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి ఆ తరువాత ఇండియాకు తిరిగొస్తుందట. అలా మానసిక ఉల్లాసం పొంది నూతనోత్సాహంతో విజయ్‌సేతుపతితో కలిసి 96 చిత్రంలో నటించనున్నట్లు తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement