సీనియర్ హీరో సరసన త్రిష!
సీనియర్ హీరో సరసన త్రిష!
Published Mon, Aug 5 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
సముద్ర కెరటం ఎంత కిందపడ్డా, పైకి లేవడం మాత్రం ఖాయం. త్రిష కూడా అంతే. ఇక సీన్ అయిపోయిందనుకున్న ప్రతిసారీ అది అబద్ధం అని నిరూపిస్తూ వరుసగా రెండు, మూడు సినిమాలు కమిట్ అయిపోతారు త్రిష. అదీ ఈ చెన్నయ్ చందమామ సత్తా. కథానాయికగా పన్నెండేళ్లకు పైగానే వెండితెరను ఏలుతున్న త్రిష ప్రస్తుతం ‘రమ్’తో పాటు మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంలోను, రెండు తమిళ చిత్రాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా, ఆమె ఖాతాలో మరో సినిమా చేరినట్లు సమాచారం. ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేశావె)లో ఓ డిఫరెంట్ త్రిషను చూపించిన గౌతమ్‌మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. అయితే ఇందులో త్రిష ఏ కుర్ర హీరో సరసనో జోడీ కట్టడంలేదు. సీనియర్ నటుడు శరత్‌కుమార్ సరసన నటించబోతున్నారట. ‘విన్నైత్తాండి...’ తర్వాత గౌతమ్ దర్శకత్వంలో మళ్లీ సినిమా చేసే అవకాశం వస్తే బాగుంటుందని త్రిష అనుకుంటున్నారట.
సూర్యతో గౌతమ్ దర్శకత్వం వహించబోతున్న ‘ధృవనక్షత్రం’తో ఆ కోరిక తీరుతుందని ఆమె భావించారు. కానీ ఆ చిత్రంలో వేరే నాయికను తీసుకోవాలనుకుంటున్నారట. పైగా, అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కే దాఖలాలు కనిపించడంలేదని వినికిడి. ఈ నేపథ్యంలో శరత్‌కుమార్‌తో చేయబోయే చిత్రం గురించి త్రిషకు గౌతమ్ చెప్పడం, ఈ చిత్రకథ, పాత్ర నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపడం జరిగాయని చెన్నయ్ టాక్.
Advertisement
Advertisement