breaking news
molakala cheruvu
-
విషాదం.. నలుగుర్ని మింగేసిన మొలకలచెరువు
అన్నమయ్య జిల్లా : జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ములకల చెరువు పెద్ద చెరువు నలుగుర్ని మింగేసింది. మొలకలచెరువు పెద్దచెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతకడానికి లావణ్య (12) నందకిషోర్ (10)లు అక్కడికి వచ్చారు. చెరువులో దిగుతుండగా మునిగిపోతున్న సమయంలో చిన్నారులు కేకలు వేశారు. అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ చిన్నారులను రక్షించే క్రమంలో మునిగిపోయాడు. చిన్నారులు లావణ్య, నంద కిషోర్ లతో కలిసి పక్కంటి చిన్నారి నందిత(11) కూడా చెరువులో దిగి మునిగిపోయింది. మృతి చెందిన వారిని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను మొలకలచెరువు పోలీసులు వెలికి తీశారు.మృతి దేహాలను చూసి మృతులు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. దీంతో గ్రామంలో పూర్తిగా విషాద చాయలు అలుముకున్నాయి. -
కారుతో బైకును ఢీకొట్టి హత్యాయత్నం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా మొలకలచెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. కారుతో బైకును ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మొలకలచెరువు సర్పంచ్ భర్త వెంకటరమణ, చంద్రమోహన్ అనే వ్యక్తి గాయపడ్డారు. తీవ్రగాయాపాలైన వీరిని కదిరి ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేత దేవేందర్ రెడ్డి వర్గీయులే దాడి చేశారని బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.