Momentary passions
-
ఏడుపు ఆపడం లేదని కోపంతో కొట్టింది..
తిరుపతి: ఓ తల్లి క్షణికావేశం తన 8 నెలల కొడుకు మృతికి కారణమైంది. మంచంపై నుంచి కిందపడ్డ చిన్నారి నొప్పితో ఎంతకీ ఏడుపు ఆపడం లేదని కోపంతో తల్లి కొట్టింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే చనిపోయాడు. తిరుపతికి చెందిన మోహన్‌కుమార్, కరిష్మాలకు ఏడాదిన్నర కిందట వివాహం అయింది. వీరికి ప్రభాస్(8 నెలల) కుమారుడు ఉన్నాడు. సోమవారం ఉదయం చిన్నారి ప్రభాస్ మంచంపై నుంచి కింద పడడంతో బాధ తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో కరిష్మా అసహనంతో కొడుకుని చెంపపై బలంగా కొట్టింది. దీంతో నోరు, చెవిలో నుంచి రక్తం కారి చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. తన బిడ్డను భార్యే కొట్టి చంపిందని బిడ్డ తండ్రి మోహన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్షణికావేశంలో బిడ్డను కొట్టానని, చంపాలని అనుకోలేదని కన్నతల్లి కరిష్మా పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరైంది. కరిష్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వీధినపడిన చెంచు కుటుంబం
క్షణికావేశానికి తల్లి.. ఆమెను కాపాడబోయి తండ్రి మృతి మన్ననూర్‌లో విషాదఛాయలు క్షణికావేశం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. భార్యభర్తల నిండు ప్రాణాలు బలి తీసుకోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ విషా ద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. అమ్రాబాద్ మం డలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య కాలనీకి చెందిన దాసరి వీరయ్య(40) అటవీశాఖలో టైగర్ ట్రాకర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య సాయిలమ్మ (35) స్థానికంగానే కూలి నాలి చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించేది. బుధవారం రాత్రి ఇంటి అవసరాలకోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు మాటామాటా అనుకోవడంతో భర్తపై ఆవేశానికి గురైన సాయిలమ్మ ఆరుబైటకు వెళ్లిపోయింది. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనని భర్త కూడా ఆమెను వెం బడించాడు. ఇంతలో పరుగెత్తుకుంటూ వెళ్లిన సాయిలమ్మ సమీపంలోని తుర్కబావిలో దూకింది. ఆమెను రక్షించడానికి బావిలో దూకిన వీరయ్యను భార్య గట్టిగా పట్టుకోవడంతోపాటు వీరయ్య తాగిన మత్తులో ఉండటంతో ఇద్దరు మృతి చెందారు. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం ఉద యం సాయిలమ్మ మృతదేహం బావి లో తేలియాడుతుండగా ఆమెను లాగడానికి ప్రయత్నించే క్రమంలో భర్త మృ తదేహం కూడా బయటపడింది. విష యం తెలుసుకున్న ఎస్ఐ ఆదిరెడ్డి సంఘటనపై కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చం పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనాథలైన పిల్లలు ఇదిలావుండగా వారి పిల్లలు ఆంజనేయులు, స్వప్న అనాథలుగా మిగి లారు. మృతుల తల్లిదండ్రులు కూడా గతంలోనే చనిపోవడంతో వెనకాముందు ఎవరూ లేకుండా పోయారు. తోటి చెంచులు వారి దీన స్థితిపై చలించిపోయి అటవీశాఖ ఏసీఎఫ్ పద్మజారాణి దృష్టికి తెచ్చారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో అటవీశాఖ తరుపున ఆర్థికసాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పద్మజారాణి తెలిపారు. పిల్లల చదువుల విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు.