వీధినపడిన చెంచు కుటుంబం | Vidhina landed chenchu family | Sakshi
Sakshi News home page

వీధినపడిన చెంచు కుటుంబం

Published Fri, Nov 14 2014 1:47 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

Vidhina landed chenchu family

క్షణికావేశానికి తల్లి..         
ఆమెను కాపాడబోయి  తండ్రి మృతి
మన్ననూర్‌లో విషాదఛాయలు

 
క్షణికావేశం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. భార్యభర్తల నిండు ప్రాణాలు బలి తీసుకోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ విషా ద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. అమ్రాబాద్ మం డలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య కాలనీకి చెందిన దాసరి వీరయ్య(40) అటవీశాఖలో టైగర్ ట్రాకర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య సాయిలమ్మ (35) స్థానికంగానే కూలి నాలి చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించేది. బుధవారం రాత్రి ఇంటి అవసరాలకోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు మాటామాటా అనుకోవడంతో భర్తపై ఆవేశానికి గురైన సాయిలమ్మ ఆరుబైటకు వెళ్లిపోయింది. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనని భర్త కూడా ఆమెను వెం బడించాడు. ఇంతలో పరుగెత్తుకుంటూ వెళ్లిన సాయిలమ్మ సమీపంలోని తుర్కబావిలో దూకింది. ఆమెను రక్షించడానికి బావిలో దూకిన వీరయ్యను భార్య గట్టిగా పట్టుకోవడంతోపాటు వీరయ్య తాగిన మత్తులో ఉండటంతో ఇద్దరు మృతి చెందారు. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం ఉద యం సాయిలమ్మ మృతదేహం బావి లో తేలియాడుతుండగా ఆమెను లాగడానికి ప్రయత్నించే క్రమంలో భర్త మృ తదేహం కూడా బయటపడింది. విష యం తెలుసుకున్న ఎస్‌ఐ ఆదిరెడ్డి సంఘటనపై కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చం పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
అనాథలైన పిల్లలు


ఇదిలావుండగా వారి పిల్లలు ఆంజనేయులు, స్వప్న అనాథలుగా మిగి లారు. మృతుల తల్లిదండ్రులు కూడా గతంలోనే చనిపోవడంతో వెనకాముందు ఎవరూ లేకుండా పోయారు. తోటి చెంచులు వారి దీన  స్థితిపై చలించిపోయి అటవీశాఖ ఏసీఎఫ్ పద్మజారాణి దృష్టికి తెచ్చారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో అటవీశాఖ తరుపున ఆర్థికసాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పద్మజారాణి తెలిపారు. పిల్లల చదువుల విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement