గోవా ఎయిర్పోర్టుకు రుణాలు ఓకే: జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోవాలో జీఎంఆర్ ప్రతిపాదించిన మోపా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ పూర్తయింది. విమానాశ్రయ అభివృద్ధికై యాక్సిస్ బ్యాంకు రూ.1,330 కోట్ల రుణాన్ని సమకూరుస్తోంది.
ఉత్తర గోవాలోని మోపా ఎయిర్పోర్టు అభివృద్ధి ప్రాజెక్టును 2016 నవంబరులో జీఎంఆర్ దక్కించుకుంది. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్తోపాటు విమానాశ్రయాన్ని 40 ఏళ్లపాటు జీఎంఆర్ నిర్వహిస్తుంది. మరో 20 ఏళ్లపాటు నిర్వహణ కాంట్రాక్టు పొడిగించేందుకు అవకాశం కూడా ఉంది. ట్రాఫిక్కు అనుగుణంగా దశలవారీగా విస్తరణ చేపడతామని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు.