Morphed obscene photos
-
ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు
ఫోన్ పోతే లైట్ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్ లాంటిది ఈ ఘటన. ఫోన్ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చోరీ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్: గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్ నుంచే అవి పోస్ట్‌కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రతీకాత్మక చిత్రం ఖంగుతిన్న భర్త ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో మేల్ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రతీకాత్మక చిత్రం అవి మార్ఫింగ్‌వి! కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్‌పుర పోలీసులు.. సైబర్ క్రైమ్ వింగ్సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. -
వయసు 25.. బాధితులు 50 మంది
తిరువనంతపురం : గృహిణిలను టార్గెట్ చేసి.. మార్ఫ్డ్ ఫోటోలతో బెదిరించి.. లైంగిక వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ప్రదీశ్ కుమార్(25) ఇంటి పట్టున ఉండే వివాహిత మహిళల్ని టార్గెట్ చేస్తాడు. నెమ్మదిగా వారితో పరిచయం పెంచుకుంటాడు. వారి కుటుంబంలో ఏవైనా ఇబ్బదులు ఉన్నాయేమో తెలుసుకుంటాడు. సాయం చేస్తానని నమ్మబలికి వారి భర్తల ఫోన్ నెంబర్లు సంపాదిస్తాడు. తర్వాత అమ్మాయి ఫోటోతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి.. సదరు మహిళల భర్తలకు వల వేస్తాడు. వారితో చాట్ చేసి.. వాటి స్క్రీన్ షాట్స్‌ను వారి భార్యలకు పంపిస్తాడు. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని నమ్మిస్తాడు. ఈ ప్లాన్ వర్క్‌వుట్ అయ్యి సదరు మహిళలు భర్తను దూరంగా పెట్టాక.. ఓదార్పు పేరుతో ఆ గృహిణిలకు దగ్గరవుతాడు. వారిని వీడియో చాట్‌కు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత సదరు మహిళల మార్ఫ్డ్ ఫోటోలు చూపించి వారిని బెదిరించడం ప్రారంభిస్తాడు. మాట వినకపోతే ఈ ఫోటోలను వారి భర్తలకు చూపిస్తానని బెదిరించి వారిని లొంగదీసుకుంటారు. ఇలా ఏకంగా 50 మంది మహిళల్ని నమ్మించి, మోసం చేసి, బెదిరించి దారుణాలకు పాల్పడ్డాడు. చివరకు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు యువకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని నుంచి మహిళల మార్ఫ్డ్ ఫోటోలను, ల్యాప్‌టాప్‌ని స్వాధీనం చేసుకున్నారు. -
బృందావనంలో అశ్లీల చిత్రాల కలకలం
ప్రముఖ ఆథ్యాత్మిక పట్టణం, ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో కాలేజీ విద్యార్థినుల అశ్లీల చిత్రాలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 50 మందికి పైగా అమ్మాయిల ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో ఉంచారు. వారిని కాల్ గర్ల్స్ గా పేర్కొంటూ వాట్సాప్ ద్వారా మార్ఫ్డ్ ఫొటోలు, అమ్మాయిల పేర్లు, చిరునామా తదితర వివరాలు పొందుపర్చారు. దీంతో బాధిత యువతుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, గత ఏడాది నవంబర్ లోనూ బృందావనంలో ఇదే తరహాలో పదుల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఉదంతం సంచలనం రేపింది. తాజా వ్యవహారంపై బాధితురాళ్లలో కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై నగర ఎస్సీ అలోక్ ప్రియదర్శిని స్పందిస్తూ ఈ ఉదంతాన్ని సైబర్ క్రైమ్ కేసుగా నమోదుచేసి నిందితులకోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, గతంలో చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే బృందావనంలో మళ్లీ ఇలాంటి ఘోరాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.