Most Expensive Cities
-
అత్యంత విలాసవంతమైన నగరాలు.. ముఖ్యంగా ఆ రెండూ..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్లు టాప్‌లో నిలిచాయి. ఈ ఏడాది మెస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ లిస్ట్‌లో తర్వాతి స్థానాల్లో జెనీవా, న్యూయార్క్, హాంకాంగ్‌లు ఆక్రమించాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఈ జాబితాను గురువారం వెల్లడించింది. స్థానిక కరెన్సీ పరంగా సగటున, 200 కంటే ఎక్కువ సాధారణంగా ఉపయోగించే వస్తువులు, సేవల కోసం ఈ ఏడాదిలో 7.4శాతం ధరలు పెరిగాయి, గత సంవత్సరం రికార్డు 8.1శాతం పెరుగుదల నుంచి కొద్దిగా తగ్గింది. కానీ ఇప్పటికీ 2017-2021లో ట్రెండ్ కంటే చాలా ఎక్కువ అని నివేదిక తెలిపింది. అలాగే పలు కేటగిరీల్లో అధిక ధరల కారణంగా సింగపూర్ గత పదకొండు సంవత్సరాల్లో తొమ్మిదవసారి ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని తిరిగి సాధించింది. కార్ నంబర్లపై కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా సింగపూర్ప్రపంచంలోనే అత్యధిక రవాణా ధరలు నమోదైనాయి. దుస్తులు, కిరాణా , మద్యం లాంటి ఇతర అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. జెనీవా , న్యూయార్క్‌లు మూడో స్థానంలో ఉండగా, హాంకాంగ్ ఐదు, లాస్ ఏంజెల్స్ ఆరో స్థానంలోనూ నిలిచాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియా సగటున తక్కువ ధరల పెరుగుదల కొనసాగింది. జపాన్‌లోని ఒసాకా , టోక్యోతో పాటు, చైనాలోని నాన్జింగ్, వుక్సీ, డాలియన్, బీజింగ్ - ర్యాంకింగ్‌లలో ఈర్యాంకింగ్స్లో పతనమైన అతి పెద్ద నగరాలు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ నగరం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో వరుసగా నిలిచాయి. అయితే గతేడాది 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ నగరం మాత్రం ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకి.. మొదటి పది నగరాల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత స్థానాన్ని లాస్ ఏంజెల్స్ నగరం కైవసం చేసుకుంది. అలాగే అమెరికాలోని చికాగో (21), మినియాపోలిస్ (24), వాషింగ్టన్ డీసీ (26), హ్యూస్టన్ (31), శాన్ ఫ్రాన్సిస్కో (34) నగరాలు ఆయా స్థానాల్లో నిలిచాయి. గృహావసర వస్తువులు, బట్టలు, ఆహారం, రవాణ అంశాల పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేశారు. అయితే ఇందులో గృహాల అద్దెలు మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. కాగా యూఎస్‌లోని 16 నగరాలలో సర్వే చేస్తే కీవ్‌లాండ్, అట్లాంటా మాత్రం చాలా తక్కువ ఖర్చుతో కూడిన నగరాలుగా నిలిచాయి. న్యూయార్క్ నగరంలో కంటే ఈ రెండు నగరాల్లో 31 శాతం తక్కువ వ్యయం అవుతుందని తెలింది. అదే సరాసరి చూసుకున్నా ఆమెరికాలోని ఇతర నగరాలు కంటే న్యూయార్క్ నగరంలో 20 శాతం అధికంగా ఖర్చవుతుంది. డాలర్ బలపడటంతో గతేడాది కంటే అమెరికన్ నగరాలు ఈ ఏడాది ఖరీదుగా మారాయి. కాగా యూఎస్‌లోని నగరాల్లో కంటే పశ్చిమ యూరప్‌లోని 28 నగరాలు ఖరీదు తక్కువగా ఉన్నాయి. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో జీవన వ్యయం 40 శాతంకి పడిపోయింది. రష్యాలో రూబుల్ కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.