ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ నగరం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో వరుసగా నిలిచాయి. అయితే గతేడాది 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ నగరం మాత్రం ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకి.. మొదటి పది నగరాల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత స్థానాన్ని లాస్ ఏంజెల్స్ నగరం కైవసం చేసుకుంది. అలాగే అమెరికాలోని చికాగో (21), మినియాపోలిస్ (24), వాషింగ్టన్ డీసీ (26), హ్యూస్టన్ (31), శాన్ ఫ్రాన్సిస్కో (34) నగరాలు ఆయా స్థానాల్లో నిలిచాయి.
గృహావసర వస్తువులు, బట్టలు, ఆహారం, రవాణ అంశాల పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేశారు. అయితే ఇందులో గృహాల అద్దెలు మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. కాగా యూఎస్లోని 16 నగరాలలో సర్వే చేస్తే కీవ్లాండ్, అట్లాంటా మాత్రం చాలా తక్కువ ఖర్చుతో కూడిన నగరాలుగా నిలిచాయి. న్యూయార్క్ నగరంలో కంటే ఈ రెండు నగరాల్లో 31 శాతం తక్కువ వ్యయం అవుతుందని తెలింది. అదే సరాసరి చూసుకున్నా ఆమెరికాలోని ఇతర నగరాలు కంటే న్యూయార్క్ నగరంలో 20 శాతం అధికంగా ఖర్చవుతుంది.
డాలర్ బలపడటంతో గతేడాది కంటే అమెరికన్ నగరాలు ఈ ఏడాది ఖరీదుగా మారాయి. కాగా యూఎస్లోని నగరాల్లో కంటే పశ్చిమ యూరప్లోని 28 నగరాలు ఖరీదు తక్కువగా ఉన్నాయి. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో జీవన వ్యయం 40 శాతంకి పడిపోయింది. రష్యాలో రూబుల్ కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.