mother and daughter commit suicide
-
విషాదం: తల్లీ, కూతురు ఆత్మహత్య..
వైఎస్సార్ కడప: కడప నగరంలో ఓ తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని శంకరాపురం రామాలయం వీధిలో నివాసం ఉంటున్న తల్లి శ్రావణి(34) తన తొమ్మిదేళ్ల కూతురు శాన్వితో కలిసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రావణి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నారని, ఆమెకు పదేళ్ల క్రితం వివాహం అయిందని పోలీసులు తెలిపారు. ఇక శ్రావణి నాలుగేళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటూ కూతురు శాన్వితో ఉంటుంన్నారని పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా తల్లి, కూతురు ఆత్మహత్య కలకలం రేపుతోంది. -
బతుకుపోరులో అలసి..
సాక్షి, నిర్మల్: బతుకుపోరులో అలసిన ఓ తల్లి కూతురితోపాటు తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ కథనం ప్రకారం.. పట్టణంలోని రాంనగర్లో నివాసముంటున్న భాగ్యశ్రీ (42)కి మహారాష్ట్ర ఉమ్రి తాలూకా బెల్దర్ గ్రామానికి చెందిన శివరాజ్ హన్‌శెట్టితో వివాహమైంది. వీరికి కూతురు సిన్ని (21) ఉంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న భాగ్యశ్రీ ఇంట్లోనే బ్యూటీపార్లర్ నడుపుతూ కూతురిని చదివిస్తోంది. గతేడాది కూతురికి మెడిసిన్‌లో ర్యాంకు రావడంతో, సంగారెడ్డిలోని మెడికల్ కాలేజీలో చేర్పించింది. ఈ క్రమంలో డబ్బు అవసరమై అప్పు చేయగా, వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నానని పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పుకుని బాధపడేది. ఆదివారం రాత్రి తన తండ్రితో ఫోన్లో మాట్లాడిన భాగ్యశ్రీ, సోమవారం ఉదయం కూతురితో కలసి క్రిమిసంహారక మందు తాగి, ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: చెప్పుతో కొట్టిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య -
ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనోవేదనకు గురైన ఆ ఇల్లాలు.. పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన ఎర్రాపహాడ్ గ్రామంలో విషాదాన్ని నింపింది. సాక్షి, తాడ్వాయి: ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన బద్దం లక్ష్మారెడ్డి, బద్దం లింగమణి(42) దంపతులకు కుమారుడు రణదీప్‌రెడ్డి,కూతురు శిరీష(18) ఉన్నారు. వీరికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నారు. రణదీప్‌రెడ్డి హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తుండగా కూతురు కామారెడ్డిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరు ఏడాది క్రితం ఇంటిని నిర్మించుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షలకుపైగా అప్పులు చేశారు. చేసిన అప్పులు పెరిగిపోతుండడం, కూతురు పెళ్లీడుకు రావడం, కుమారుడి చదువుకు డబ్బులు అవసరం కావడంతో లింగమణి మానసికంగా నలిగిపోయింది. అప్పుల విషయమై ఆదివారం రాత్రి భర్తతో గొడవ జరిగింది. రాత్రి ఇద్దరూ భోజనం చేయలేదు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు ) సోమవారం ఉదయమే లక్ష్మారెడ్డి పొలానికి వెళ్లిపోయాడు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన లింగమణి, శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. లక్ష్మారెడ్డి తాగునీటికోసం సమీపంలోని మరో బావి వద్దకు వెళ్లగానే తల్లి తన చీర కొంగును కూతురు నడుముకు కట్టింది. ఇద్దరూ ఒకేసారి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు తాగి తిరిగి వచ్చిన లక్ష్మారెడ్డికి భార్యాకూతుళ్లు కనిపించకపోవడంతో చుట్టూ చూశాడు. బావిలోకి తొంగిచూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ వెంకట్, ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. (కరోనా.. 24 గంటల్లో 146 మంది మృతి) -
ఇక బతకలేమని..
వరంగల్ క్రైం : కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. అయినా కొడుకు, కూతురు ఉన్నారనే ధైర్యంతో అన్నీ తానై బతుకు బండిని ముందుకు సాగించింది. అకస్మాత్తుగా కొడుకు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించాడు. కన్న కొడుకు కానరాని లోకాలకు తరలిపోవడంతో ఆ తల్లికి గుండె పగిలినంత పనైంది. కొడుకును విడిచి ఉండలేనంత ప్రేమను మనసులో నింపుకుందేమో.. ఆ కొడుకు దగ్గరికే వెళ్లిపోయింది. తాను లేకుండా తన కూతురు ఎలా బతుకుతుందో అని.. వెళ్తూ కూతురును కూడా మృత్యుఒడిలోకి తీసుకెళ్లింది.. హృదయవిదారకమైన ఈ ఘటన హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తురు–బొక్కలగడ్డలో గురువారం జరిగింది.హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మనుగొండ సరిత(39), కూతురు మనుగొండ మధుమిత (17) ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మృతి చెందింది. హన్మకొండ ఎస్సై ఎలబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సరిత భర్త మనుగొండ బాబు 1992 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్.. 2007లో అనారోగ్యంతో బాబు చనిపోయారు. భర్త మరణంతో అతడి ఉద్యోగం సరితకు రాగా రెవెన్యూ శాఖలో పనిచేస్తోంది. నాలుగు నెలల క్రితం ఆమె కుమారుడు రోహిత్(21) హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. కట్టుకున్న భర్త, కన్నకొడుకు మరణంతో సరిత తీవ్ర మానసిక వేదనకు గురైంది. రోహిత్ మరణించిన తర్వాత ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఇటీవలే బంధువులు, తోటి ఉద్యోగులు ధైర్యం చెప్పడంతో కొంతకాలంగా విధులకు హాజరవుతోంది. ఉద్యోగం చేస్తూ సుబేదారి ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారి ఇంట్లోనే ఉంటోంది. గురువారం దేశాయిపేటలో బంధువుల పెళ్లి ఉండడంతో సరిత తల్లిదండ్రులు వెళ్లా రు. సరితను పెళ్లికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా వెళ్లలేదు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీసేందుకు బయటి నుంచి సరితను పిలిచారు. లోపల గడియ పెట్టి ఉండి.. ఎంత పిలిచినా సరిత, మధుమిత పలుకలేదు. దీంతో బలవంతంగా తలుపులను తెరిచి చూడగా సరిత, మధుమిత ఇంటి దూలానికి వేలాడుతూ కనిపించారని ఎస్సై వివరించారు. దూలానికి వేలాడుతున్న వారిని చూసి తల్లిదండ్రులు, అన్నావదినలు గుండెలవిసేలా రోధించారు. 11 ఏళ్లలో కుటుంబంలో అందరూ చనిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. సరిత, మధుమితల మృతదేహాలను చూసి బంధువులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు కంటతడి పెట్టుకున్నారు. సరిత తండ్రి ఇజ్జగిరి చేరాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉద్యోగంలో సౌమ్యురాలు.. హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసే మనుగొండ సరితకు సౌమ్యురాలుగా పేరుంది. కొడుకు మరణించిన తర్వాత అందరితో తక్కువగా మాట్లాడేదని, కొడుకు జ్ఞాపకాలతోనే రోజులు గడిపేదని సహ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి కంటతడితో నివాళులు అర్పించారు. సరిత మరణం వార్త విన్న ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతల పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. తన కొడుకులా.. ఎవరికీ జరగొద్దని.. సరిత కుమారుడు రోహిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడని బంధువులు తెలిపారు. తన కొడుకులా మరెవరికీ అలాంటి పరిస్థితి రావొద్దని.. సరిత.. రోహిత్ స్నేహితులు, బంధువులకు 100 మందికిపైగా హెల్మెట్లు కొనిచ్చింది.. ఈ సారి రాఖీ పండుగకు తన బంధువుల్లో ద్విచక్రవాహనాలు ఉన్న వారందరికీ హెల్మెట్లు కొనివ్వడానికి కూడా ఏర్పా ట్లు చేసిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. నివాళులర్పించిన కలెక్టర్, జేసీ భర్త, కుమారుడి మరణంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మనుగొండ సరిత, కూతురు మధుమిత మృత దేహాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట, జేసీ దయానంద్, హన్మకొండ తహసీల్దార్ ఖాజామోయినోద్దిన్‌లు సందర్శించి నివాళులర్పించారు. గురువారం రాత్రి కావడంతో మృత దేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
పోలీస్‌స్టేషన్ ఆవరణలో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
పొదిలి, న్యూస్‌లైన్: పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పొదిలి పట్టణంలో మంగళవారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... వడ్లమాని గురుబ్రహ్మం, సుశీల దంపతులకు కుమార్తె రాజ్యం, కుమారుడు వీరబ్రహ్మం సంతానం. వీరు స్థానిక చిన్నబస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కాగా, దాసరిగడ్డకు చెందిన చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే మహిళ.. సుశీల కుటుంబానికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. ఆ అప్పు తిరిగి ఇవ్వాలని కోరగా సుశీల కుటుంబ సభ్యులు తనపై దాడిచేశారంటూ చెన్నంశెట్టి ఉమామహేశ్వరి ఇటీవల స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఈ నెల 9వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న సుశీల, ఆమె కుమార్తె రాజ్యంను మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తమను కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలుసుకున్న వారిద్దరూ.. పోలీసులు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ తమవెంట తెచ్చుకున్న పురుగుమందు సేవించి పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన పోలీసులు వెంటనే 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మహిళల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను పోలీసులు పెద్దదిగా భావించి కేసు నమోదు చేసి తనను, తన కుమార్తెను బజారుకీడ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ సుశీల ఆరోపించారు. పది రోజులుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం... చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము సుశీల కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు వెల్లడించారు. ఆ మేరకు వారిని పిలిచి విచారిస్తున్నామన్నారు. మంగళవారం వారు వచ్చిన సమయంలో తాను విద్యుత్ కార్యాలయం వద్దకు వెళ్తున్నానని, 10 నిముషాల్లో వస్తానని వారితో కూడా చెప్పి వెళ్లానని, ఈలోగా వారు పురుగుమందు సేవించారని వివరించారు. సిబ్బంది సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.