Mother jailed
-
ఉ. కొరియాలో అంతే!
హామ్‌గ్యాంగ్: ఉత్తరకొరియాలోని ఓ మహిళకు వింత ఘటన ఎదురైంది. దేశాధినేతల ఫొటోలను మంటల నుంచి రక్షించలేకపోయినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే హ్యామ్గ్యాంగ్ ప్రావిన్స్‌లోని ఒన్సోంగ్ కౌంటీలో ఓ ఇంటికి నిప్పంటుకుంది. అందులో ఉన్న ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అయితే ఈ క్రమంలో దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుటుంబ సభ్యుల ఫొటోలను మంటల నుంచి కాపాడలేకపోయింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే 15 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం ప్రతి ఇంట్లో కిమ్ పూర్వీకులైన కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ ఫొటోలను తప్పక ఉంచుకోవాలి. ఫొటోలను సరిగా చూసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారు మరి. అదీ కిమ్ రాజ్యంలోని ప్రజల తిప్పలు. -
ఇంతకంటే దారుణాన్ని వినలేదు
ఈ బెంచ్‌పై మూడున్నరేళ్లు ఉన్నాను.. ఇన్ని రోజుల్లో ఈ కోర్టుకు వచ్చిన కేసుల్లో అత్యంత దారుణమైన కేసు ఇదే. ఓ తల్లి చేసిన దారుణం గురించి హామిల్టన్ కౌంటీ కోర్టు జడ్జి లెస్లీ ఘిజ్ చేసిన వ్యాఖ్యలివి. నిందితురాలు కొర్కొరన్కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంత భారీ శిక్ష పడటానికి ఆమె చేసిన నేరం ఏంటంటే.. కొర్కొరన్ డ్రగ్స్‌కు బానిసైంది. హెరాయిన్ తీసుకోకుంటే రోజు గడిచేదికాదు. అయితే డ్రగ్స్ కొనేందుకు ఆమె వద్ద సరిపడా డబ్బు ఉండేదికాదు. అలాగని డ్రగ్స్ అలవాటు మానులేకపోయింది. రెండేళ్ల క్రితం కొర్కొరన్ డబ్బుల కోసం తన 11 ఏళ్ల కుమార్తెను డ్రగ్ డీలర్ వద్ద కుదువ పెట్టి అప్పు తీసుకుంది. ఇంతకంటే దారుణమేంటంటే తన కూతురును అత్యాచారం చేసేందుకు డ్రగ్ డీలర్‌కు అనుమతిచ్చింది. ఆ నీచుడు అభంశుభం తెలియని బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయిని హింసించి తన వాంఛలు తీర్చుకునేవాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలను వీడియోలు తీసేవాడు. కొర్కొరన్ తన కూతురును ఇంతటితో వదిలిపెట్టలేదు. కుమార్తెకూ బలవంతంగా డ్రగ్స్ ఇచ్చేది. పాపం ఆ చిన్నారి ప్రతిసారి వాంతి చేసుకునేంది. ఐదు నెలల పాటు ఆ అమ్మాయి చిత్రహింసలు అనుభవించింది. ఈ విషయం వెలుగు చూడటంతో కొర్కొరన్, డ్రగ్ డీలర్ షాండెల్ విల్లింగామ్పై కేసు నమోదు చేశారు. న్యాయస్థానం వీరిద్దరినీ దోషులుగా ప్రకటించింది. తప్పు చేసినందుకు కొర్కొరన్లో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. ఆమెకు కఠిన కారాగార శిక్ష వేయగా, షాండెల్కు శిక్ష ఖరారు చేయాల్సివుంది. బాధితురాలు ప్రస్తుతం తన తండ్రి, సవతి తల్లి దగ్గర ఉంటోంది. విషాదం తాలుకు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. -
ఫేస్ బుక్‌లో మునిగిన తల్లికి ఐదేళ్ల జైలు
బేవెర్లీ: కొడుకు ఆలనా పాలనా చూడకుండా ఫేస్ బుక్‌లో మునిగిపోయిన తల్లికి, బ్రిటన్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. తల్లి అలసత్వం కారణంగానే ఆమె రెండేళ్ల కుమారుడు నీటిలో పడి మృతి చెందాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు.. జోషువా బార్నెట్ (2), 2014 మార్చి14న తూర్పు యార్క్ షైర్, బెవెర్లీలోని తమ ఇంట్లో గార్డెన్ లో ఆడుకుంటుండగా అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లలో పడ్డాడు. ఆ సమయంలో బాలుడు తల్లి క్లెయిర్ బార్నెట్(31) ఫోన్ లో ఫేస్ బుక్ తో బిజీగా ఉంది. బాలుడిని కొద్దిసేపటి తర్వాత గమనించి ఆస్పత్రికి తీసకెళ్లినా అప్పటికే ఆలస్యం అవ్వడంతో ఆ పిల్లాడు మరణించాడు. 2013లో ఒకసారి ఇదే పిల్లాడు అదే తల్లి అలసత్వం కారణంగా ప్రాణాలు కోల్పోబోయి.. తృటిలో తప్పించుకున్నాడు. వాళ్లు హల్ ప్రాంతంలో నివసించే సమయంలో ఆ పిల్లాడు రోడ్డు మీదకు వచ్చాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఆ బాలున్ని కొట్టబోయింది. డ్రైవర్ చివరి నిమిషంలో తప్పించాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు.. పిల్లల కోసం ఏర్పాటచేసిన స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించడంతో, ఆ తల్లిపై పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో బాలుడి విషయంలో అలసత్వం చూపడంపై వచ్చిన నాలుగు ఆరోపణలను క్లెయిర్ బార్నెట్ అంగీకరించింది. ఇప్పుడు అదే బాలుడు నీటిలో పడ్డ సమయంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు పోంతన లేని సమాధానాలు చెప్పింది. విచారణలో ఆమె ఫేస్ బుక్ చూడటంలో బిజీగా ఉన్నట్టు తేలింది. చివరికి పాత ఘటనను కూడా పరిగణనలోకి తీసుకొని.. కోర్టు క్లెయిర్ బార్నెట్ కి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.