breaking news
mother sold daughter
-
భర్త అచేతనావస్థ.. భార్యకు గుండెకోత
బరేలీ : ప్రమాదంలో భర్త అచేతన స్థితిలో మంచానికే పరిమితమై ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువైపోవటంతో పూట గడవటం కష్టంగా మారిపోయింది. గర్భవతి అయినప్పటికీ భార్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. ఇక ఒక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత భర్త చికిత్స కోసం ఆ తల్లి త్యాగానికి సిద్ధపడింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని హకీజంగల్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన కదిలించివేస్తోంది. వివరాల్లోకి హరస్వరూప్ మౌర్య అనే వ్యక్తి నిర్మాణ పనుల్లో కూలీగా పని చేసేవాడు. గత అక్టోబర్‌లో గోడ కూలి అతనిపై పడి నడుం చచ్చుబడిపోయింది. అప్పటి నుంచి అతను కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన అతని భార్య కష్టం మీద కూలీ పనులకు వెళ్లింది. డిసెంబర్ 14న ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. భర్త చికిత్స కోసం తన బిడ్డను అమ్మేయాలని నిర్ణయించుకుంది. భార్య చేసే పనికి ముందు భర్త అడ్డుచెప్పినప్పటికీ.. చివరకు అతన్ని ఆమె ఒప్పించింది. ఓ మధ్యవర్తి సాయంతో పొరుగు గ్రామంలోని ఓ జంటకు బిడ్డను అమ్మి.. అలా అమ్మగా వచ్చిన 45,000 రూపాయలతో భర్తకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయించింది. ఇంతలో బంధువులు ఆమెను నిలదీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం సాయం చేయలేదు : మహిళ సాయం కోసం బంధవుల వద్ద చెయ్యి చాస్తే ఒక్కరూ స్పందించలేదు. రెండు నెలలపాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాం. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం హామీ పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీస స్పందన లేకుండా పోయింది. నా భర్త ప్రాణాలు నిలబెట్టుకునేందుకు తనకు ఇంతకు మించి మార్గం కనిపించలేదు అని ఆమె చెబుతోంది. ఇప్పటికే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. వారి పోషణ కష్టంగా మారిందని.. అందుకే భర్తను మాములు మనిషిని చేసేందుకు ఈ పని చేసినట్లు ఆమె వివరించారు. ఇక ఈ అంశంపై స్పందించేందుకు సీఎం కార్యాలయం సిబ్బంది సుముఖత వ్యక్తం చేయటం లేదు. -
అమ్మే.. అమ్మేసింది..!
*చిన్నారిని చెరబట్టిన కామాంధులు.. పలుమార్లు లైంగికదాడి! *ఆటో ప్రమాదంతో వెలుగుచూసిన అకృత్యాలు *పోలీసుల అదుపులో ముగ్గురు.. నిందితుల్లో హోంగార్డు చీరాల (ప్రకాశం): కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించిన ఘటన ఇది.. అమ్మే అమ్మేసింది.. మానవ సంబంధాలు రక్త మాంసాల వ్యాపారం అయ్యా యి. చిన్నారిని ఒకరి తర్వాత మరొకరు అమ్ముకున్నారు. అభం శుభం తెలియని బాలిక అంగడి బొమ్మగా మారింది. గతవారం చీరాల పోలీసుల చెంతకు చేరిన పదకొండేళ్ల బాలికను విచారించగా గగుర్పొడిచే విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ బాలాజీనగర్‌కు చెందిన దంపతులకు కుమార్తె ఉంది. భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె భర్తను వదిలి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కుమార్తె తల్లితోనే ఉంటోంది. అయితే తల్లి ప్రియుడు బాలికపై కన్నేశాడు. బాలికపై పలుమార్లు లైంగికదాడికి యత్నించాడు. ఈ విషయం బాలిక తల్లికి చెప్పినా.. కన్నకూతురినే కసురుకుంది. విషయం ‘ఎవరికైనా చెబితే చంపుతానని’ బెదిరించింది. కాళ్లు పట్టుకున్నా కనికరించని కామాంధులు.. ఇంతటితో ఆగని తల్లి.. కన్నకూతురిని విజయవాడలోని ఓ మహిళకు అమ్మేసింది. అక్కడి నుంచి మూణ్నెల్ల్ల క్రితం మంగళగిరికి చెందిన మరో మహిళకు విక్రయించింది. కొద్దిరోజుల తర్వాత మంగళగిరికి చెందిన మహిళ చీరాల బోడిపాలేనికి చెందిన ప్రస్తుతం దేవాంగపురి గుమస్తాల కాలనీలో ఉంటూ వ్యభిచారం నిర్వహిస్తున్న వాణికి అమ్మేసింది. అయితే, వాణి ప్రియుడు జితిన్‌లాల్ కూడా మృగంగా మారి బాలికపై పలుమార్లు లైంగికదాడికి ఒడిగట్టాడు. అలాగే ఆ ఇంటికి తరచూ వెళ్లే చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ హోంగార్డు కూడా బాలికను చెరబట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనను వదిలేయాలని కాళ్లు పట్టుకున్నా ఆ చిన్నారిని కామాంధులు కనికరించలేదు. ఆటో ప్రమాదంతో గుట్టు రట్టు.. వాణి ఆ బాలికను గుంటూరులో గుడికి వెళ్దామని తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. వాణికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే సమయంలో బాలిక గత సోమవారం అక్కడి నుంచి తప్పించుకుని కారంచేడు చేరుకుంది. ఒంటరిగా దిగాలుగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికను.. గ్రామంలో మంచాలు విక్రయిస్తున్న చిలకలూరిపేటకు చెందిన అబ్దుల్‌బాషా అనే యువకుడు గమనించాడు. బాలిక వద్ద వివరాలు సేకరించి ఆమెను తన స్వగ్రామమైన చిలకలూరిపేట తీసుకెళ్లి స్నేహితుల సహాయంతో చిలకలూరిపేట పోలీసుల వద్దకు చేర్చాడు. అయితే అక్కడి పోలీసులు చీరాల స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో యువకులు బాలికను గత మంగళవారం చీరాల వన్‌టౌన్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు చీరాల అర్బన్ సీడీపీవో నాగమణికి బాలికను అప్పగించారు. సీడీపీవో దగ్గరికి వెళ్లిన బాలిక తనపై జరిగిన దారుణాలను చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. దీనిపై సీడీపీవో నాగమణి లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు అనాథ బాలికగా భావించిన పోలీసులు విచారణ చేస్తే జరిగిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనలో హోంగార్డుతోపాటు వాణి ప్రియుడు జితిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉన్న బాలిక తల్లి , ఆమె ప్రియుడు , విజయవాడ, మంగళగిరికి చెందిన మహిళలతోపాటు, చీరాలలో వ్యభిచారం చేస్తున్న వాణి, ఆమె ప్రియుడు జితిన్, హోంగార్డుపై కేసు నమోదు చేసి సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.