Motor Accident Claims Tribunal
-
Motor Accident Claims: ఆ కేసులను వేగంగా పరిష్కరించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మోటార్ వాహనాల ప్రమాదాల క్లెయిమ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకోసం మూడు నెలల్లోగా పోలీసు స్టేషన్లలో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రోడ్డు ప్రమాద క్లెయిముకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ నజీర్, జేకే మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ‘‘రోడ్డు ప్రమాదంపై ఫిర్యాదు అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దర్యాప్తు అధికారి మోటారు వాహనాలు(సవరణ) నిబంధనలు–2022 ప్రకారం నడుచుకోవాలి. ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టును 48 గంటల్లోగా క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కు సమర్పించాలి’’ అని పేర్కొంది. -
నష్టపరిహారం కేసు వేయవచ్చు
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో... కేస్ స్టడీ సారధి ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. అతని వయస్సు 26 సంవత్సరాలు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు వున్నారు. తండ్రి చనిపోయి 5 సంవత్సరాలైంది. కుటుంబ భారమంతా ఇకనుండి అతనిదే. తల్లి అప్పూసప్పూ చేసి చదివించింది. భవిష్యత్‌పై ఎంతో ఆశతో, తల్లినీ, చెల్లెళ్లనూ బాగా చూసుకోవాలనే ఆశయంతో ఉద్యోగంలో చేరాడు. విధి వక్రీకరించి డ్యూటీ ముగించుకొని వస్తుండగా రాత్రి 10 గంటల టైంలో సారధి బైక్‌ను ఒక లారీ డీకొట్టింది. అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. కళ్లు తెరిచే సరికి ఒక కాలు తొలగించబడి వుంది. అమ్మా, చెల్లెళ్లు విషాద వదనాలతో కనిపించారు. స్నేహితులు నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లమన్నారు. దారిన వెళ్లేవాళ్లు స్పందించారనీ, పోలీసు కంప్లయింట్ ఇచ్చారనీ, లారీ వివరాలు తెలిశాయని మిత్రులు తెలిపారు. అసలు నష్టపరిహారం ఎలా అడగాలి? దానికి సంబంధించిన వివరాలకై న్యాయవాదిని సారధి తల్లి, చెల్లెళ్లు సంప్రదించారు. వారు చెప్పిన వివరాలు ఇవి: ఒక వ్యక్తి ప్రమాదానికి లోనై తీవ్ర గాయాలపాలైనా, శారీరక వైకల్యం ఏర్పడినా, దురదష్టవశాత్తు చనిపోయినా, కోర్టును ఆశ్రయించి, వాహన డ్రైవర్, యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీల నుండి (వాహనం ఇన్సూరెన్స్ చేసిన కంపెనీ) నష్టపరిహారం క్లెయిమ్ చేయవచ్చును. జిల్లా కోర్టులలో వుండే ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్’ ట్రిబ్యునల్స్‌లో కేసులు వేయాలి. కోర్టులో 1) ప్రమాదం చేసిన వాహనం గుర్తింపు, 2) ప్రమాదం చేసిన వ్యక్తి, అతని వివరాలు, చిరునామా, 3) వాహన యజమాని వివరాలు, 4) ప్రమాదం జరిగిన తేదీ, టైమ్, ప్లేస్, 5) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్), 6) మెడికల్ సర్టిఫికెట్, 7)ప్రమాదం చూసిన వ్యక్తుల సాక్ష్యాలు, 8) బాధితుని పుట్టిన తేదీ వివరాలు, శాలరీ సర్టిఫికెట్స్, 9) మెడికల్ బిల్స్, 10)ప్రమాదం చేసిన డ్రైవర్ డ్రైవింగ్ లెసైన్స్, 11) ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు మొదలైనవి పొందుపరచాలి. అదృష్టవశాత్తు లాయర్‌గారు చెప్పిన డాక్యుమెంట్స్ దాదాపు అన్నీ వారివద్ద వున్నాయి. నష్టపరిహారం కేసు వేయడానికి సిద్ధపడ్డారు. -
'మృతుడి కుటుంబ సభ్యులకు 1.17 కోట్లు చెల్లించండి'
న్యూఢిల్లీ: నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఉద్యోగి కుటుంబసభ్యులకు రూ.1.17 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని వాహన ప్రమాదాల పరిష్కారాల సంస్థ తీర్పునిచ్చింది. ఐఓసీలో ప్రాజెక్ట్ మేనేజర్ ముఖేశ్ ఖురానా కుటుంబసభ్యులకు రూ.1,17,10,224లు నష్టపరిహారాన్ని చెల్లించాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రిసైడింగ్ ఆఫీసర్ హరీశ్ దుదని ఆదేశించారు. 2009 సెప్టెంబర్ 10న ముఖేశ్ వెళుతున్న వాహనాన్ని ఎదురుగా అతి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ముఖేష్ ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. 49 ఏళ్ల ముఖేశ్ ఖురానా నెలకు రూ.1.14 లక్షలను సంపాదించేవాడని కుటుంబసభ్యులు వివరించారు. ముఖేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ హాజరు కాకపోవడం, ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందన్న ఆధారాలు కూడా లభించలేకపోవడంతో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి చెల్లించాల్సి వస్తోంది. డ్రైవర్ రామ్ అవాధ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను జంప్ చేసే క్రమంలోనే ప్రమాదం జరిగిందన్న డాష్ ఎక్స్ పోర్ట్ యజమాని వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీనికి సరైన ఆధారాలు లేవని తెలిపింది.