నష్టపరిహారం కేసు వేయవచ్చు | Compensation may be the case... | Sakshi
Sakshi News home page

నష్టపరిహారం కేసు వేయవచ్చు

Published Sun, May 8 2016 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

నష్టపరిహారం కేసు వేయవచ్చు

నష్టపరిహారం కేసు వేయవచ్చు

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో...
 
కేస్ స్టడీ
సారధి ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. అతని వయస్సు 26 సంవత్సరాలు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు వున్నారు. తండ్రి చనిపోయి 5 సంవత్సరాలైంది. కుటుంబ భారమంతా ఇకనుండి అతనిదే. తల్లి అప్పూసప్పూ చేసి చదివించింది. భవిష్యత్‌పై ఎంతో ఆశతో, తల్లినీ, చెల్లెళ్లనూ బాగా చూసుకోవాలనే ఆశయంతో ఉద్యోగంలో చేరాడు. విధి వక్రీకరించి డ్యూటీ ముగించుకొని వస్తుండగా రాత్రి 10 గంటల టైంలో సారధి బైక్‌ను ఒక లారీ డీకొట్టింది. అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. కళ్లు తెరిచే సరికి ఒక కాలు తొలగించబడి వుంది.

అమ్మా, చెల్లెళ్లు విషాద వదనాలతో కనిపించారు. స్నేహితులు నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లమన్నారు. దారిన వెళ్లేవాళ్లు స్పందించారనీ, పోలీసు కంప్లయింట్ ఇచ్చారనీ, లారీ వివరాలు తెలిశాయని మిత్రులు తెలిపారు. అసలు నష్టపరిహారం ఎలా అడగాలి? దానికి సంబంధించిన వివరాలకై న్యాయవాదిని సారధి తల్లి, చెల్లెళ్లు సంప్రదించారు. వారు చెప్పిన వివరాలు ఇవి: ఒక వ్యక్తి ప్రమాదానికి లోనై తీవ్ర గాయాలపాలైనా, శారీరక వైకల్యం ఏర్పడినా, దురదష్టవశాత్తు చనిపోయినా, కోర్టును ఆశ్రయించి, వాహన డ్రైవర్, యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీల నుండి (వాహనం ఇన్సూరెన్స్ చేసిన కంపెనీ) నష్టపరిహారం క్లెయిమ్ చేయవచ్చును.

జిల్లా కోర్టులలో వుండే ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్’ ట్రిబ్యునల్స్‌లో కేసులు వేయాలి. కోర్టులో 1) ప్రమాదం చేసిన వాహనం గుర్తింపు, 2) ప్రమాదం చేసిన వ్యక్తి, అతని వివరాలు, చిరునామా, 3) వాహన యజమాని వివరాలు, 4) ప్రమాదం జరిగిన తేదీ, టైమ్, ప్లేస్, 5) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్), 6) మెడికల్ సర్టిఫికెట్, 7)ప్రమాదం చూసిన వ్యక్తుల సాక్ష్యాలు, 8) బాధితుని పుట్టిన తేదీ వివరాలు, శాలరీ సర్టిఫికెట్స్, 9) మెడికల్ బిల్స్, 10)ప్రమాదం చేసిన డ్రైవర్ డ్రైవింగ్ లెసైన్స్, 11) ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు మొదలైనవి పొందుపరచాలి.

అదృష్టవశాత్తు లాయర్‌గారు చెప్పిన డాక్యుమెంట్స్ దాదాపు అన్నీ వారివద్ద వున్నాయి. నష్టపరిహారం కేసు వేయడానికి సిద్ధపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement