Mountain Dew
-
‘మౌంటెన్ డ్యూ’పై హక్కులు పెప్సీకోవే..
సాక్షి, హైదరాబాద్: ‘మౌంటెన్ డ్యూ’ట్రేడ్‌మార్క్‌పై పెప్సికోకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. మాగ్ఫాస్ట్ పానీయాల కంపెనీ మౌంటైన్ డ్యూ లేబుల్‌పై వాటర్ బాటిల్ విక్రయించడాన్ని సవాల్ చేస్తూ పెప్సీకో తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. సదరు లేబుల్‌పై ఇరు కంపెనీలకు హక్కులున్నాయని ట్రయల్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే కూల్‌డ్రింక్‌కు సంబంధించి పెప్సికోకు, వాటర్ బాటిల్‌కు సంబంధించి మాగ్ఫాస్ట్కు హక్కులున్నాయంది. దీన్ని పెప్సీకో హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ పి. నవీన్‌రావు, జస్టిస్ జి.రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెప్సీకో తరఫున సీనియర్ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. 1985లోనే పెప్పీకో మౌంటైన్ డ్యూ పేరిట ట్రేడ్‌మార్క్ పొందిందన్నారు. మాగ్ఫాస్ట్ ఆ లేబుల్‌ను వినియోగించడం చట్టవిరుద్ధమన్నారు. మాగ్ఫాస్ట్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పెప్సీకో ట్రేడ్‌మార్క్ పొందడంపై తమకు తెలియదని, 2000 సంవత్సరం నుంచి తాము మౌంటెన్ డ్యూ పేరిట వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మౌంటెన్ డ్యూపై పెప్సీకో కంపెనీకే హక్కులున్నాయని చెప్పింది. కూల్‌డ్రింక్, వాటర్ బాటిల్ ఒకే పేరుపై ఉంటే వినియోగదారులు తికమకపడటంతో పాటు రెండూ పెప్సీకోవే అనుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. -
'లెట్స్ డ్యూ ఇట్' అంటున్న మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా ?
Mahesh Babu Is New Brand Ambassador For Mountain Dew: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్న 'టక్కరి దొంగ'. అభిమానుల గుండెల్లో 'రాజ కుమారుడి'లా కుర్చీ వేసుకున్న 'ఒక్కడు'. అందం, అభినయం, క్రమశిక్షణలో 'శ్రీమంతుడు'. పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన 'మహార్షి'. ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ ఎంతో ఒద్దికగా, దురుసుగా ప్రవర్తించకుండా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అందుకే ఆయన్ను 'సరిలేరు మీకెవ్వరూ' అని అభిమానులు గుండెల్లో గూడు కట్టుకుంటారు. కొత్త సినిమాలతో అభిమానులను ఎప్పుడూ అలరిస్తుంటారు. అలాగే జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటారు సూపర్ స్టార్. కేవలం సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా టాప్ ఉంటారు మహేశ్. ఇదీవరకు ఆయన థంప్స్‌అప్, అభి బస్, ఐడియా, సంతూర్, ప్యారగాన్ తదితర వాణిజ్య ప్రకటనల్లో నటించారు. తాజాగా శీతలపానీయమైన 'మౌంటేన్ డ్యూ' ఇండియాకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు మహేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్లో 'లెట్స్ డ్యూ ఇట్' అంటూ పోస్ట్ చేశారు. ఇటీవల ఆయన మోకాలికి శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారని తెలిసిందే. Let's Dew It! @MountainDewIn #DarrKeAageJeetHai#BhayamVoduluGelichiChudu #NewBeginnings pic.twitter.com/nbrPU8QjcH — Mahesh Babu (@urstrulyMahesh) December 3, 2021 ఇది చదవండి: సర్జరీ కోసం అమెరికా వెళ్తున్న మహేశ్‌బాబు -
గేమ్ ఆడుతుంటే టైమ్ తెలియదు
‘‘చాలా ప్రాబ్లమ్స్ నుంచి డిస్కనెక్ట్ కావడానికి వీడియో గేమింగ్ సులువైన పద్ధతి. గేమ్ ఆడుతుంటే టైమ్ తెలీదు. గేమింగ్, టెక్నాలజీ కలిసి అందించే అనుభవాలను ఎంజాయ్ చేయడానికి అందరూ ఇష్టపడతారు. డ్యూ ఎరీనాతో నా అనుబంధం ప్రారంభమైన నాటి నుంచి ఈ–స్పోర్ట్స్ గురించి చాలా తెలుసుకున్నాను. డ్యూ ఎరీనా థర్డ్ ఎడిషన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను’’ అన్నారు అక్కినేని అఖిల్. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సాఫ్ట్ డ్రింక్ ‘మౌంటెన్ డ్యూ’ మూడవ ఎడిషన్‌లో భాగంగా డ్యూ ఎరినా గేమింగ్‌ను నగరవాసులకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనంలో నాన్న (నాగార్జున)గారితో కలిసి గేమ్ ప్లే చేసేవాణ్ణి. చిన్నప్పుడు ఎక్కువగా చదవమనేవారు కానీ ఇప్పుడు గేమింగ్ అనేది అఫీషియల్‌గా మారింది. వీడియో గేమింగ్‌ను ఏషియన్ గేమ్స్‌లో చేర్చారని విన్నా. అందుకు హ్యాపీ. వీడియో గేమ్స్ ఆడేవారికి నేషనల్ స్థాయిలో మంచి ప్లాట్‌ఫామ్ దొరికింది. వాళ్లను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది. దేశంలో యువతకు గేమింగ్ పట్ల ఆసక్తి పెంచడానికి మౌంటెన్ డ్యూ కృషి చేస్తోంది. ఇలాంటి గేమ్స్ రూపొందించడం ద్వారా భారతీయ గేమర్లు తమ సృజనను, ప్రతిభను ఆవిష్కరించుకోవచ్చు. ఇందులో భాగంగా కౌంటర్ స్టైక్, డోటా–2 గేమ్‌లు ఆన్లైన్లో, రాకెట్లీగ్, స్ట్రీట్‌ఫైట్ గేమ్‌లు ఆన్‌గ్రౌండ్ గేమింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మౌంటెన్ డ్యూ కంపెనీతో భాగస్వామ్యం కావడం హ్యాపీగా ఉంది. ఈ థర్డ్ ఎడిషన్ గేమింగ్‌లో త్రీ ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్... గేమింగ్ ట్రక్ 10 రాష్ట్రాల్లో 83 నగరాల్లోని 270 ప్రాంతాలలో పర్యటిస్తుంది. సెకండ్ ఫేజ్ ఆన్లైన్. థర్డ్ మీ మొబైల్. విన్నర్స్ 20 లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది. విజేతలుగా నిలిచే అభ్యర్థుల చిత్రాలను లిమిటెడ్ ఎడిషన్ మౌంటెన్ డ్యూ బాటిల్స్‌పై ముద్రిస్తారు. అక్టోబర్ 2018లో గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది’’ అన్నారు. ఇంకా అఖిల్ మాట్లాడుతూ– ‘‘నాకు మౌంటెన్ డ్యూ అంటే ఎందుకు ఇంత ఇష్టం అంటే.. అవుట్డోర్ స్పోర్ట్స్ నుంచి వీడియోగేమ్ వరకు అన్నింటినీ ప్రోత్సహిస్తారు. వాళ్లు కేవలం డ్రింక్‌ను మాత్రమే ప్రమోట్ చేయడం లేదు. ఒక లైఫ్ స్టైల్‌ను ప్రమోట్ చేస్తున్నారు. మౌంటెన్ డ్యూ యాడ్స్ వాళ్ల క్యాంపెయినింగ్, ఐడియాస్ అన్నీ నాకు ఇష్టం. వాళ్లు ఏ ఐడియా తెచ్చినా నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొన్న చేసిన యాడ్ నుంచి ఇంతకుముందు చేసిన యాడ్‌తో పాటు క్యాంపెయినింగ్ అంతా నాకు ఆసక్తికరంగా ఉంటుంది. వీళ్లతో నాకు అసోసియేషన్ హ్యాపీ. రీసెంట్గా చేసిన ఎరీనా నుంచి ఇంతకుముందు చేసిన మనాలి షూట్ వరకు సూపర్’’ అన్నారు. ఇంకా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మరిన్ని వివరాలకు www.dewarena.com వెబ్సైట్ సందర్శించి, మౌంటెన్ డ్యూ ఫేస్బుక్ పైజీపై అప్డేట్స్ తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. -
బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్
పెప్సికో కంపెనీ దక్షిణాదిన తన మార్కెట్‌ను పటిష్టం చేసుకోవడంలో భాగంగా కూల్‌డ్రింక్ మౌంటెన్ డ్యూకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించానికి ఇద్దరు దక్షిణాది సినిమా నటులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తమిళ హీరో ఆర్య, ప్రముఖ సినీనటుడు, నాగార్జున కుమారుడు అఖిల్‌లతో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఈ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రైజ్ అబౌ ఫియర్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్నీ చేపట్టింది.