కొండవాగులో గిరిజనుడి గల్లంతు
బుట్టాయగూడెం : మారుమూల ప్రాంతమైన కన్నారపాడు సమీపంలోని కొవ్వాడ కొండవాగు ప్రవాహంలో బుధవారం గోగుమిల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు ఒనుముల లింగారెడ్డి(35) కొట్టుకుపోయాడు. వర్షాల వల్ల ఈ ప్రాంతంలోని కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. కన్నాపురం సంత మార్కెట్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టు మాజీ ఎంపీటీసీ సభ్యుడు యు.ఏసుబాబు తెలిపారు. లింగారెడ్డి ఆచూకీ కోసం గ్రామస్తులు గాలిస్తున్నట్లు వెల్లడించారు.