కొండవాగులో గిరిజనుడి గల్లంతు | tribe missing in mountain stream | Sakshi
Sakshi News home page

కొండవాగులో గిరిజనుడి గల్లంతు

Published Thu, Sep 22 2016 1:33 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

tribe missing in mountain stream

బుట్టాయగూడెం : మారుమూల ప్రాంతమైన కన్నారపాడు సమీపంలోని కొవ్వాడ కొండవాగు ప్రవాహంలో బుధవారం గోగుమిల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు ఒనుముల లింగారెడ్డి(35) కొట్టుకుపోయాడు. వర్షాల వల్ల ఈ ప్రాంతంలోని కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. కన్నాపురం సంత మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టు  మాజీ ఎంపీటీసీ సభ్యుడు యు.ఏసుబాబు తెలిపారు. లింగారెడ్డి ఆచూకీ కోసం గ్రామస్తులు గాలిస్తున్నట్లు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement