mpdos transfers
-
పడక
ఏళ్ల తరబడి బదిలీలు లేవు.. కొన్నిచోట్ల అసలే లేరు.. ఉన్నచోట్ల అతుక్కుపోయి కూర్చున్నారు.. మండల స్థాయిలో పాలన వ్యవస్థను గాడినపెట్టే మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)ల తీరిదీ. స్తంభిస్తున్న మండలాభివృద్ధి - పాతుకుపోయిన ఎంపీడీఓలు - ఆరేళ్లుగా బదిలీల ఊసేలేదు.. - దీర్ఘకాలంగా ఒకేచోట పలువురు - 14 మండలాల్లో అధికారులే లేరు - గాడి తప్పుతున్న పాలన - పనులు నత్తనడక సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఆరేళ్లుగా ఎంపీడీవోల బదిలీలు అటకెక్కాయి. పలువురు అధికారులు ఒకే మండలంలో ఏళ్ల తరబడి సీటును అంటిపెట్టుకుని ఉండిపోయారు. దీంతో అవినీతి పెరుగుతుండటంతో పాటు ఎంపీపీ అభివృద్ధి కార్యాలయాల్లో పాలన గాడితప్పుతోంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో ఇన్చార్జీల పాలన కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు నత్తనడక నడుస్తున్నాయి. నడిపించే వారేరీ? రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో మండల స్థాయిలో సమర్థులైన అధికారులు కరువయ్యారు. దీంతో ఆయా పథకాల ఫలాలు క్షేత్రస్థాయికి చేరటం లేదన్న విమర్శలున్నాయి. జవాబుదారీతనం లేక ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు ఎంపీడీవోలపై కలెక్టర్ రోనాల్డ్‌రాస్ సస్పెన్షన్ వేటు వేశారు. మండల స్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీఓల వ్యవస్థ సక్రమంగా లేనందున వెంటనే బదిలీ లు చేపట్టి వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఎంపీడీఓల పని తీరుపై ఎమ్మెల్యేలూ అసంతృప్తితో ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట విధులు జిల్లా వ్యాప్తంగా 46 మంది ఎంపీడీవోలు ఉండ గా 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 32 చోట్ల పూ ర్తిస్థాయి ఎంపీడీవోలు పనిచేస్తున్నారు. వీరిలో 23 మంది సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం రేగో డ్, వెల్దుర్తి, రాయికోడ్, ములుగు, జిన్నారం, న ర్సాపూర్, ఝరాసంగం, ఆర్సీపురం, గజ్వేల్, తూప్రాన్, మెదక్, అల్లాదుర్గం, చిన్నకోడూరు ఎంపీడీవోలు ఐదారేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నా రు. తొగుట, శివ్వంపేట, టేక్మాల్, కల్హేర్, కొం డాపూర్, న్యాల్కల్, పెద్దశంకరంపేట, కొల్చా రం ఎంపీడీవోలు 3-4 ఏళ్లుగా ఉన్నచోట పనిచేస్తున్నారు. బదిలీల షెడ్యూల్ విడుదలలో జా ప్యం కారణంగా వీరంతా దీర్ఘకాలికంగా ఒకేచో ట పనిచేస్తున్నారు. దీనివల్ల అవినీతికి ఆస్కారంతో పాటు పాలనలో నిర్లక్ష్య ధోరణలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇన్చార్జీల పాలనతో ఇబ్బందులు జిల్లాలోని దౌల్తాబాద్, కంగ్టి, మనూరు, నారాయణఖేడ్, పుల్కల్, దుబ్బాక, నంగనూరు, చిన్నశంకరంపేట, పాపన్నపేట, జగదేవ్‌పూర్, సంగారెడ్డి, హత్నూర, సదాశివపేట, కోహీర్ మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఆయా చోట్ల ఇన్చార్జీ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల పలు పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. -
ఎంపీడీఓల బదిలీలకు ఒత్తిళ్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం :తమకు అనుకూలమైన ఎంపీడీఓలను నియమించుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఈమేరకు జెడ్పీ అధికారులకు సిఫారసు లేఖలిస్తున్నారు. కోరిన విధంగా నియామకాలు చేపట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే తాము ఇప్పుడేమీ చేయలేమని జెడ్పీ అధికారులు చేతులెత్తేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇటీవల బదిలీలు చేశామని, కొత్త ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిస్తే తప్ప మార్పులు చేర్పులు చేసే అధికారం లేదని వారు చెప్పడంతో పరువుపోతుందని భావించిన తెలుగుతమ్ముళ్లు ఎంపీడీఓల బదిలీ కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చిన దగ్గరి నుంచి ఎంపీడీఓల విషయంలో టీడీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం పలువురు ఎంపీడీఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, తమను కనీసం పట్టించుకోలేదన్న అక్కసుతో ఉన్న వారు... తమ మాట వినని వారిని బదిలీచేయించి, అనుకూలంగా ఉన్న వారిని రప్పించుకోడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. ఎన్నికల ముందు బదిలీ అయిన ఎంపీడీఓలంతా తిరిగి తమ సొంత జిల్లాకు వస్తున్నారని తెలుసుకున్న టీడీ పీ నేతలు తమ మండలాలకు ఫలా నా ఎంపీడీఓలను నియమించాలని జిల్లా పరిషత్ అధికారులకు సిఫారసు లేఖలిచ్చారు. కానీ, టీడీపీ నేతల దూకుడుకు ఇంతకుముందు వరకూ గవర్నర్ పాలనలో ఉన్న సర్కార్ కళ్లెం వేసింది. ఎన్నికలకు ముందు పనిచేసిన స్థానంలోనే బదిలీ అయిన ఎంపీడీఓలను మళ్లీ నియమిం చాలని ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది. దీంతో జెడ్పీ అధికారులు ఏమీ చేయలేకపోయారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్లివ్వలేమని కరాఖండీగా చెప్పేశారు. అయినా జెడ్పీ అధికారులను టీడీపీ నేతలు వదలడం లేదు. ఏం చేస్తారో తెలియదు గాని తాము చెప్పినోళ్లకి పోస్టింగ్స్ ఇవ్వావల్సిందేనని మళ్లీ ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి లేఖలిస్తున్నారు. ఏదొక మెలిక పెట్టి బదిలీలు చేయాలని లేదంటే తమ పరువు పోతుందని చెప్పకనే చెబుతున్నారు. ఎంత హడావుడి చేసినా తమనేమీ చేయలేకపోయారంటూ సదరు ఎంపీడీఓలు అహం ప్రదర్శించే అవకాశం ఉందని, అందుకే బదిలీ చేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇరకాటంలో జెడ్పీ అధికారులు ఇటు ప్రభుత్వం ఉత్తర్వులు, అటు టీడీపీ నేతల ఒత్తిళ్లతో జెడ్పీ అధికారులు ఇరకాటంలో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తే తమ ఉద్యోగానికి ఎసరొస్తుందని, కావాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెప్పించుకోవాలని, అంతకుమించి చేసేదేమి లేదని జెడ్పీ అధికారులు చెబుతున్నారు. అయినా కొంతమంది టీడీపీ నాయకులు ఒప్పుకోవడం లేదు. చేయాల్సిందేనంటూ పట్టు బడుతున్నారు. మరి కొందరు మాత్రం ఎమ్మెల్యేలను ఆశ్రయించి, ప్రభుత్వం ద్వారా ఉత్వర్వులు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. క్యాబినెట్ తొలి సమావేశం ముగిసాక మంత్రులతో మాట్లాడి బదిలీలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అనుచరులకు ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారు. -
ఎంపీడీఓల బదిలీలు షురూ..
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీడీవోల బదిలీలు జరుగుతున్నారుు. ఇవి మల్టీజోన్ పోస్టులు కావడంతో జోన్ మార్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లాలకు చెందిన ఎంపీడీఓల బదిలీల జాబితా తయారైనప్పటికీ తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది రంగారెడ్డి జిల్లాకు వెళ్లేందుకు అప్షన్ ఇవ్వడంతో కమిషనర్ కార్యాలయంలోని అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై సందిగ్ధం నెలకొన్నప్పటికీ మంగళవారం జిల్లా నుంచి రాయపర్తి ఎంపీడీఓ సువర్ణరాజు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో ప్రక్రియ ప్రారంభమైంది. 1వ జోన్‌లోని ప్రకాశం జిల్లా కొనకలమిట్ట మండ లానికి చెందిన ఎంపీడీఓ బానోతు సరితను 2వజోన్ పరిధిలోని వరంగల్ జిల్లాకు, ఆమె స్థానంలో రామపర్తి మండలం ఎంపీడీఓ సువర్ణరాజును ఆదే జిల్లాకు బదిలీ చేశారు. రెండు రోజుల్లో ఎంపీడీఓల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని తెలిసింది.